ఒక్క ఐడియా..వంటమనిషి జీవితాన్నే మార్చేసింది..వైరల్ అయిన పీతల కూర

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనే మాట చాలామంది జీవితాల్లో రుజువైంది. బెంగళూరులో ఉంటున్న అంకిత్ వెంగుళేర్కర్ అనే వ్యక్తికి వచ్చిన ఐడియా వాళ్లింట్లో పనిచేస్తున్న పనిమనిషి కమ్ వంటమనిషి జీవితాన్నే మార్చివేసింది. అంకిత్ వాళ్ల ఇంట్లో సరోజ్ అనే 47 ఏళ్ల మహిళ పనిచేస్తోంది. ఇంటి పనితో పాటు వంటపనికూడా చేస్తోంది. సరోజ్ చేసే వంటలు ఆ ఇంట్లో వాళ్లకు తెగ నచ్చేస్తుంటాయి. రసం పెట్టినా అమృతంలా ఉంటుందని మెచ్చుకుంటుంటారు. నువ్వే కనుక ఫుడ్ బిజినెస్ పెడితే టాప్ లోకెళిపోతావ్ అంటూ వాళ్లు సరదాగా అంటుంటే సరోజ్ తెగ సిగ్గుపడిపోయేది. కానీ అదే నిజమవుతుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.కానీ..సరోజ్ చేసే వంటలు తిన్న ప్రతీసారి అంకిత్‌ మెచ్చుకునేవాడు. అలా ఓ రోజు అంకిత్ కు సరదాగా అనే మాట నిజం ఎందుకు కాకూడదని అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఇంత రుచికరంగా వండే ఆమెకు ఫుడ్ హోమ్ డెలివరీ బిజినెస్ పెట్టించాలి అనుకున్నాడు. ఇలా చేస్తే ఇక భర్త చనిపోయి తన ముగ్గురు పిల్లల్ని కష్టపడి పోషించుకుంటున్న సరోజ్ తమ ఇంట్లోనే కాదు ఏ ఇంట్లోనూ పనిమనిషిగా చేయాల్సిన అవసరం ఉండదు..ఆమె స్వయంగా బిజినెస్ చేసుకోవచ్చు..కదా అనుకున్నాడు. అలా..అంకిత్ వంట బిజినెస్ చేయడానికి కావాల్సిన వస్తువులు అన్ని తీసుకుని వచ్చాడు. ఓ రోజు తన ఇంట్లోనే అంకిత్ ప్రోత్సామంతో బిజినెస్ ప్రారంభించింది. మొదటి రోజు పీతల కర్రీ వండింది.ఆమె వండిన పీతల కూరను అంకిత్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది బెంగళూరులో వైరల్ అయింది. దీంతో ఒక్కరోజే పది ఆర్డర్ లు వచ్చాయి. అది చూసి సరోజ్ తెగ సంబరపడిపోయింది. అదంతా మా సార్ దయే అంటోంది. అలా వచ్చిన ఆర్డర్ కు అంకిత్ ఒక్కో పార్శిల్ రూ.300కు ధరకు అమ్మాడు. 2 కేజీల పీతల కర్రీతో 10 ఆర్డర్లతో ఫాస్ట్ గా అమ్ముడైపోయాయి.సరోజ్ వంటల గురించి ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా స్పందించడం చాలా చాలా గమనించాల్సిన విషయం. సరోజ్ వంటల గురించి వికాస్ ఖన్నా ట్వీట్ చేస్తూ సరోజ్ న్యూయార్క్‌కి కూడా డెలివరీ చేస్తుందా అని అడిగారు.


Related Posts