లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

IPL 2020, RCB vs CSK: బెంగళూరుపై గెలిపించిన గైక్వాడ్.. 8వికెట్ల తేడాతో చెన్నై విజయం

Published

on

దుబాయ్ వేదికగా జరుగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న 44వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అధ్భుతంగా బౌలింగ్ చేయగా.. బ్యాటింగ్‌లో కూడా యువ ఆటగాళ్లు రాణించారు. చెన్నై బౌలర్లు అద్భుత ప్రదర్శనతో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లను భారీ స్కోరు చెయ్యకుండా కట్టడి చేయగా.. రుతురాజ్ గైక్వాడ్, రాయుడు రాణించగంతో 18.4ఓవర్లలో 150పరుగులు చేసి జట్టు విజయం సాధించింది.ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే మైదానంలో పరుగులు రాబట్టాడు. డివిలియర్స్ కాసేపు రాణించినా భారీ స్కోరు చెయ్యడంలో మాత్రం విఫలం అయ్యారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు ఆరంభంలో అదరగొట్టింది.ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కొహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 43 బంతుల్లో 50పరుగులు చెయ్యగా.. డివిలియర్స్ 39, దేవదత్ పడిక్కల్ 22, ఆరోన్ ఫించ్ 15 పరుగులు చేశారు. 42పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా.. బెంగళూరు స్కోర్ నడిపించే బాధ్యతను కెప్టెన్ కొహ్లీ, డివిలియర్స్ తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పగా.. భారీ స్కోరు చేస్తున్నట్లుగా అనిపించింది.అయితే 18వ ఓవర్లలో డివిలియర్స్.. ఆ తర్వాత మోయిన్ అలీ, కొహ్లీ, మోరిస్ వరుసగా అవుట్ అవడంతో బెంగళూరు స్కోర్ 150 పరుగుల మార్క్ కూడా చేరుకోలేదు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ రెండు, మిచెల్ సాంత్‌నర్ ఒక వికెట్ తీసుకున్నాడు.. కొత్త బౌలర్ మోను కుమార్ రెండు ఓవర్లలో 20పరుగులు చేశాడు. ఈ క్రమంలో చెన్నై టార్గెట్ 146పరుగులుగా ఫిక్స్ అవ్వగా.. 18.4ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 150పరుగులు చేసి జట్టు 8వికెట్ల తేడాతో విజయం సాధించింది.రాయల్ ఛాలెంజర్స్ నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ చెన్నైకి అద్భుతమైన ఆరంభం లభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 46 పరుగులు జోడించారు. అయితే 13 బంతుల్లో 25 పరుగులు చేసిన డూప్లెసిస్.. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.దీని తరువాత గైక్వాడ్ రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని అంబటి రాయుడుతో కలిసి పంచుకున్నాడు. రాయుడు 27 బంతుల్లో 39 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివరికి 51 బంతుల్లో 65 పరుగులు చేసిన గైక్వాడ్ అజేయంగా నిలవడంతో బెంగళూరుపై చెన్నై జట్టుకు గెలుపు లభించింది. అతను నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో 21 బంతుల్లో 19 పరుగులు చేసిన కెప్టెన్ ఎంఎస్ ధోని నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో గైక్వాడ్‌కు ఇది తొలి అర్ధ సెంచరీ.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *