-
Home » IPL 2020- RCB vs KKR: కోల్‌కత్తాపై బెంగళూరు ఘన విజయం
IPL-2020
IPL 2020- RCB vs KKR: కోల్‌కత్తాపై బెంగళూరు ఘన విజయం
Published
5 months agoon
By
vamsi
కోల్‌కత్తాపై బెంగళూరు ఘన విజయం
12/10/2020,11:09PMబెంగళూరు, కోల్కత్తా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అధ్భుతంగా ఆడడంతో కోల్కత్తా 82పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలయ్యింది. కోల్కత్తా బ్యాట్స్మెన్లు బెంగళూరు బౌలర్ల దెబ్బకు 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులు మాత్రమే చెయ్యగలిగారు. సుబ్మాన్ గిల్ మాత్రమే కోల్కత్తా బ్యాట్స్మెన్లలో 34పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్, రాహుల్ త్రిపాఠి చెరో 16పరుగులు చెయ్యగా.. మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోరు కూడా చెయ్యలేకపోయారు.
బెంగళూరు స్కోరు 194/2.. కోల్కత్తా టార్గెట్ 195
12/10/2020,9:22PMకోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నిర్ణీత 20ఓవర్లలో 2వికెట్లు నష్టానికి 194పరుగులు చేసింది. దీంతో కోల్కత్తా జట్టు టార్గెట్ 195పరుగులుగా అయ్యింది. డివిలియర్స్ మెరుపులు స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. డివిలియర్స్ 33బంతుల్లో 73పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 28బంతుల్లో 33పరుగులు చేశాడు. దేవదత్ పాడిక్కల్ 23బంతుల్లో 32పరుగులు చెయ్యగా.. ఆరోన్ ఫించ్ 37బంతుల్లో 47పరుగులు చేశాడు. కోల్కత్తా జట్టులో ప్రసీద్ కృష్ణ, ఆండ్రీ రస్సెల్ చెరొక వికెట్ తీసుకున్నారు.
ఓపెనింగ్ అదిరింది.. ఆరు ఓవర్లకు 47పరుగులు..
12/10/2020,8:06PMకొల్‌కత్తాతో జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు.. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 47పరుగులు పూర్తి చేసింది. ఓపెనింగ్‌కు వచ్చిన ఫించ్, పాడిక్కల్ అదరగొడుతున్నారు. Aaron Finch 18బంతుల్లో 23పరుగులు చెయ్యగా.. Devdutt Padikkal కూడా 18బంతుల్లో 23పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.
కోల్‌కత్తాపై టాప్ స్కోరు 213/4
12/10/2020,7:45PMమ్యాచ్ జరుగుతున్న Sharjah Cricket Stadium చాలా చిన్నది కాగా.. పరుగులు రాబట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో కూడా పరుగులు సునామీ కనిపించే అవకాశం ఉంది. కోల్‌కత్తాపై రాయల్ ఛాలెంజర్స్ చివరిసారిగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన ఆటలో 4వికెట్లు నష్టానికి 213పరుగులు చేశారు. నేటి వేదిక చాలా చిన్నది కావడంతో ఆ మార్క్ క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది.
బెంగళూరు బలాలు ఇవే:
12/10/2020,7:30PMఈ సీజన్లో ఇప్పటివరకు బెంగళూరు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఐపిఎల్ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన KKR రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.
ఈ క్రమంలో నేటి మ్యాచ్ రసవత్తరంగా ఉండబోతుంది. కెప్టెన్ కోహ్లీ గత మూడు మ్యాచ్‌ల్లో తన ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. చెన్నైపై ఒంటరిగా 90 పరుగులు చేశాడు. జట్టుకు బలమైన స్కోరు ఇవ్వడంలో విజయవంతం అయ్యాడు. కోహ్లీతో పాటు, బెంగళూరు ఓపెనర్ దేవదత్ పాడికల్ మొదటి నుంచీ ఫామ్‌లో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ మాత్రం కాస్త నిలకడగా నిలబడాల్సిన పరిస్థితి.
ఈ జట్టుకు డివిలియర్స్ రూపంలో మరో స్టార్ బ్యాట్స్ మాన్ ఉన్నాడు. ఇక కోహ్లీ జట్టు బౌలింగ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. శ్రీలంకకు చెందిన ఇసురు ఉడానా, నవదీప్ సైనిలు బెంగళూరుకు బలమైన బౌలర్లుగా ఉన్నారు. మోరిస్ చెన్నైపై మూడు వికెట్లు పడగొట్టాడు.
మోరిస్ నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు, సైనీ 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్పిన్‌లో యుజ్వేంద్ర చాహల్ అధ్భుతంగా రాణిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ చెన్నైపై రెండు ముఖ్యమైన వికెట్లు పడగొట్టి తన జట్టును బలపరిచాడు.
రస్సెల్ పరుగుల సునామీ ఖాయమేనా? స్ట్రైక్ రేట్ ఎంతంటే?
12/10/2020,7:14PMఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అనగానే ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. విద్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. రస్సెల్ బ్యాట్ బెంగళూరుపై ఎప్పుడూ కూడా మంచి స్కోరు చేస్తుంది. బెంగళూరుపై కోల్‌కతా పేలుడు బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ రికార్డుల లెక్కలు గట్టిగానే ఉన్నాయి.
ఈ సీజన్లో రస్సెల్ బ్యాట్ ఇంతవరకు గట్టిగా ఆడకపోయినా కూడా.. ఈ మ్యాచ్‌లో మాత్రం గట్టిగా ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు అతను 6 మ్యాచ్‌ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. కానీ 2019 లో 14 మ్యాచ్‌ల్లో 510 పరుగులు చేశాడు.
రస్సెల్ బెంగళూరుపై 227 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఇది మాత్రమే కాదు, ఈ కాలంలో అతని సగటు 55.83గా ఉంది. నేటి మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ ప్రదర్శన ఎలా ఉంటది అనేది ఆసక్తికరమే.
.@Russell12A vs RCB
SR- 227.46 🤯
Avg- 53.83 👌Looking forward to some 🎆 tonight!#KKRHaiTaiyaar #Dream11IPL #RCBvKKR pic.twitter.com/L1PXZarubO
— KolkataKnightRiders (@KKRiders) October 12, 2020
IPL 2020- RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్లో సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో దినేష్ కార్తీక్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫామ్‌లో ఉండగా.. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఉత్కంఠ విజయం అందుకుంది.
Good evening 12th Man Army👋
Just under 15 minutes to go for the toss!
How excited are you for tonight’s game?!#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #RCBvKKR pic.twitter.com/hI7K9TL6lt
— Royal Challengers Bangalore (@RCBTweets) October 12, 2020
Royal Challengers Bangalore (Playing XI):
దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్ (డబ్ల్యూ), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
RCB have won the toss and elected to bat first. 💪🏻
One change to our XI, Mohammed Siraj comes in for @gurkeeratmann22. #PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #RCBvKKR pic.twitter.com/qsbgocIK5K
— Royal Challengers Bangalore (@RCBTweets) October 12, 2020
Kolkata Knight Riders (Playing XI):
రాహుల్ త్రిపాఠి, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ (w / c), టామ్ బాంటన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
How excited are you to see debutant @TBanton18 in action tonight? #KKRHaiTaiyaar #Dream11IPL #RCBvKKR pic.twitter.com/FiSwsOve1t
— KolkataKnightRiders (@KKRiders) October 12, 2020
You may like
-
ఐపీఎల్ వేలం..164 మంది ఇండియన్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ఆటగాళ్లు
-
చెన్నై టెస్టు : అశ్విన్ మాయాజాలం, ఇంగ్లండ్ 134 రన్లు, ఆలౌట్
-
IPL 2022 : BCCI కీలక నిర్ణయం, మరో రెండు టీమ్‌లు
-
ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్.. 8వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
-
22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్న గంగూలీ
-
ఐపీఎల్ లో 9 జట్లు!

ఇది సమంత వెర్షన్ మాత్రమే..

ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు

బాబు కుప్పం పర్యటన ఆంతర్యమేంటి?

కేరళ ట్రైన్లో పేలుడు పదార్ధాలు.. టార్గెట్ ఎవరు ?

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడు దాడి : బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ రచ్చ

నేచురల్ బ్యూటీ సుభిక్ష ఫొటోస్

సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్లో స్టార్స్ సందడి!

పరువాల పూనమ్ బజ్వా ఫొటోస్

‘ఉప్పెన’ సక్సెస్ సెలబ్రేషన్స్..

అనన్య నాగళ్ల ఫొటోస్

ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు

బాబు కుప్పం పర్యటన ఆంతర్యమేంటి?

కేరళ ట్రైన్లో పేలుడు పదార్ధాలు.. టార్గెట్ ఎవరు ?

భారత్ బంద్
