లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘బంగారు బుల్లోడు’ గా నరేష్ కామెడీ చూశారా!

Published

on

Bangaru Bullodu: ‘నటకిరిటీ’ డా. రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగునాట కామెడీ హీరోగా, కింగ్ ఆఫ్ కామెడీ టైమింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.. ఇటీవల ‘మహర్షి’ మూవీలో రవి వంటి నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నరేష్ కొంత విరామం తర్వాత తన మార్క్ హాస్యంతో ప్రేక్షకులను అలరించడానికి రానున్నాడు.

నరేష్, పూజా ఝవేరి జంటగా.. పి వి గిరి దర్శకత్వంలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’.. సినిమా జనవరి 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

నరేష్ మరోసారి తన మార్క్ కామెడీతో ఆకట్టుకోబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.  సతీష్ ముత్యాల విజువల్స్, సాయి కార్తీక్ మ్యూజిక్ బాగున్నాయి.. పోసాని, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, రజిత తదితరులు నటించిన ఈ చిత్రానికి లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్: గాంధీ, ఫైట్స్: రియల్ సతీష్, ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ.