రేప్ కేసులకు ఉరిశిక్ష ఖరారు చేసిన బంగ్లాదేశ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bangladesh ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ హమీద్ మంగళవారం రేపిస్టులకు మరణశిక్ష అనే ఆర్డినెన్స్ పై సంతకం పెట్టారు. జాతీయవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల తర్వాత, రీసెంట్ గా జరుగుతున్న లైంగిక దాడుల ఎఫెక్ట్‌కు ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘క్యాబినేట్ నిర్ణయానికి ప్రెసిడెంట్ కూడా ఆమోదం తెలిపారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిప్రెషన్ ప్రివెన్షన్ యాక్ట్ ఆర్డినెన్స్ ను ఇష్యూ చేశారు. అంతకుముందు రేప్ కేసులకు జీవిత ఖైదు విధించే శిక్ష నుంచి సోమవారం ఉరిశిక్షకు శిక్షను మార్చారు.న్యాయ మంత్రిత్వ శాఖ ఓ స్టేట్‌మెంట్‌లో.. ‘ఇప్పుడు రేప్ కేసులకు జీవితఖైదుకు బదులుగా మరణశిక్ష విధించనున్నారు. రేపిస్టుల అఘాయిత్యాలను అడ్డుకోవాలని ఈ మరణశిక్షను ప్రవేశపెట్టామని ప్రధాన మంత్రి షేక్ హసీనా వెల్లడించారు.

‘రేపిస్టు జంతువులా ప్రవర్తిస్తాడు. చాలా క్రూరంగా మారతాడు. అందుకే మహిళలు ఈ రోజుల్లో చాలా బాధపడుతున్నారు. అందుకే ఈ చట్టాన్ని ఆమోదించాం.’ అని మంగళవారం పేర్కొన్నారు.

‘జీవితఖైదు నుంచి రేప్‌కు గరిష్ట శిక్షగా మరణశిక్షను ఆమోదించింది క్యాబినెట్. ప్రస్తుతం పార్లెమెంట్ సెషన్ లేకపోవడంతో మేమే ఆర్డినెన్స్ జారీ చేశాం’ అని ఆమె వెల్లడించారు.

ఇటీవల జరిగిన గ్యాంగ్ రేప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆందోళనకారులు రేపిస్టులను ఉరితీయాలి, వారిపై జాలి చూపించొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. చట్టంలో మార్పులు తేవాలంటూ వేల మంది కోరుతున్నారు.

2020 జనవరి నుంచి ఆగష్టు వరకూ 889మంది మహిళలు రేప్ కు గురి అయ్యారని అయిన్ ఓ సాలిష్ కేంద్రా వెల్లడించింది. ఇంకా సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని ఎందుకంటే చాలా మంది కేసు ఫైల్ చేయడానికి రెడీగా లేరని యాక్టివిస్టులు అంటున్నారు.

Related Tags :

Related Posts :