చీర కట్టు,ఒంటినిండా నగలు..గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేస్తూ క్రికెటర్ వెడ్డింగ్ షూట్.. సో..క్యూట్ అంటున్న నెటిజన్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bangladesh women cricketer wedding shoot with sari while batting : వెడ్డింగ్ ఫోటోషూట్ లు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లంటే ఫోటోలు తీయించుకోవటమంటే పెద్ద విషయమే. తరువాత ఫోటోలు..వీడియోలు..ఇలా మార్పులు వస్తూ ఇప్పుడు పెళ్లిపేరుతో వధూవరులు ఏకంగా ఫోటో షూట్ లతో సందడి సందడి చేస్తున్నారు. ఈ ఫోటో షూట్ లు ఎంతగా వెర్రిత్తిపోయాయంటే..కరోనా వల్ల ఫోటో షూట్ కుదరలేదని ఓ కేరళ జంట ఏకంగా హానీమూన్ లో ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ తో ఫోటో షూట్ చేయించుకుని సోషల్ మీడియాని షేక్ చేశారు.


ఈ షూట్ లో వారిద్దరూ ఏకంగా ఓన్లీ బెడ్ షీట్లు చుట్టుకుని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ తో పెళ్లికి ఫోటో షూట్ తో జనాలు ముక్కున వేలేసుకునేలా చేశారు. పెళ్లికి ఫోటో షూట్ ఓకే గానీ ఇలా హానీమూన్ కు కూడా ఫోటో షూట్ లా దేవుడా అంటున్నారు జనాలు.ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్ పెళ్లా ఫోటోషూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్ళికూతురిలా పట్టుచీర కట్టుకుని..ఒంటినిండా నగలు ధరించి..గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేస్తూ చేసిన వెడ్డింగ్ షూట్ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది.


ఈ ఫోటోలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టిని కూడా ఆకర్షించాయి. ఒంటినిండా నగలు..క్రికెటర్ బ్యాట్. క్రికెటర్లకు వివాహ ఫోటోషూట్‌లు ఇలా ఉంటాయి అంటూ ఐసీసీ ఈ ఫోటోలను రీట్వీట్ చేయడం మరో విశేషం.


బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు సంజిదా ఎనిమిదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ విమెన్ గా రాణిస్తున్నారు సింజిదా. సంజిదా ఇస్లాం అక్టోబర్ 17న రంగాపూర్‌కు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాద్‌డీక్‌ను పెళ్లి చేసుకున్నారు.


ఈ సందర్బంగా క్రికెట్ పై పిచ్చి ప్రేమ..మమకారంతో ఇలా క్రికెట్‌ థీమ్‌తోనే వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. ఆ షూట్ చూసి తెగ మురిసిపోయారు. పెళ్లికూతురు ముస్తాబులోనే బ్యాట్ పట్టి కవర్ డ్రైవ్, పుల్ షాట్స్ ఫోజులతో అద్దరగొట్టారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వావ్..ఏం క్రియేటివిటీ..క్రికెట్ అంటే అంత ఇష్టమా అంటున్నారు. ఈ ఫోటోలపై లక్షలాదిమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Tags :

Related Posts :