లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

ఫేస్ బుక్ ప్రేమ,పెళ్లి… బంగ్లా యువతి చెన్నైలో అరెస్ట్

Published

on

Bangladeshi woman without valid visa arrested at Minjur : ప్రేమ గుడ్డిది..ప్రేమకు ఎల్లలు లేవు అంటుంటారు కవులు…అలాగే ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుని చెన్నైలో కాపురం పెట్టిన బంగ్లా యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమకు ఎల్లలు లేకపోయినా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించినందుకు ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

పశ్చిమ బెంగాల్ లో నివసించే శశిషేక్(28) అనే యువకుడికి పేస్ బుక్ ద్వారా బంగ్లాదేశ్ కు చెందిన పాపియోఖోష్(22) అనే యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ ప్రేమవ్యవహారంతో పాపియో ఖోష్ పాస్ పోర్టు లేకుండా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చి ప్రియుడ్ని కలుసుకుంది. అక్కడి నుంచి ఇద్దరూ కల్సి తమిళనాడు చేరుకున్నారు.నవంబర్ 12న కోవై జిల్లా పొల్లాచ్చిలో రిజిష్టర్ మ్యారేజి చేసుకున్నారు. చెన్నైలోని మింజూరులోకాపురం పెట్టి నివసిస్తున్నారు. ఈలోగా తన కుమార్తె కనిపించటంలేదని ఖోష్ తండ్రి బంగ్లాదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు భారత పోలీసుల సహకారంతో యువతి మింజూరులో ఉన్నట్లు కనుగొన్నారు.

కులాంతర వివాహాలు భావి తరాలకు మేలు..ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది..


ఈ విషయాన్ని సీబీబీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాంచీపురం పోలీసులు పాపియోఖోష్ ను అదుపులోకి తీసుకుని మీంజూరు పోలీసులకు అప్పగించారు. పాస్ పోర్టు లేకుండా భారత్ లోకి ప్రవేశించిన కారణంగా యువతిని పొన్నేరి కోర్టులో హజరు పరిచి జైలుకు తరలించారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *