Home » వచ్చే నెలలోనే ప్రైవేటు మార్కెట్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సేల్స్..
Published
2 weeks agoon
private sales of AstraZeneca vaccine next month : వచ్చేనెల ఫిబ్రవరిలో ప్రైవేటు మార్కెట్లోకి ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ రానుంది. అదే నెలలోనే వ్యాక్సిన్ సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ దాదాపు 3 మిలియన్లకు పైగా డోస్ లను బంగ్లాదేశ్ కు చెందిన Beximco Pharmaceuticals కొనుగోలుచేయనుంది. ఈ మేరకు బెక్సిమ్కో చీఫ్ అధికారి Rabbur Reza వెల్లడించారు. రెండు మోతాదులకు కలిపి ధర 4 డాలర్లు చొప్పున బెక్సిమ్కో ఒప్పందం కుదర్చుకున్నట్టు తెలిపారు.
సబ్సిడీతో కూడిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో నెలకు 5 మిలియన్ల మోతాదుల చొప్పున వేర్వేరుగా పంపిణీ చేసేలా ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరి మొదటివారంలో సీరం వ్యాక్సిన్ మోతాదులను పంపిణీ చేయనుంది. అందులో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు మార్కెట్లో వినియోగానికి కూడా పంపిణీ చేయనుంది. వారాల వ్యవధిలో ఒక్కో వ్యక్తికి వేర్వేరుగా రెండు డోస్ లు అందించనుంది.
ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యంత జనాభా కలిగిన దేశంగా బంగ్లాదేశ్‌లో160 మిలియన్లకు పైగా జనాభా ఉంది. బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రైవేటు సేల్స్‌ను బెక్సిమ్కో ప్రారంభించనుంది. వ్యాక్సిన్ ఒక మోతాదుకు రిటైల్ ధర 1,125 టాకా (13.27 డాలర్లు) ధర నిర్ణయించనుంది. ప్రస్తుతం ఒక మిలియన్ డోస్ డీల్ కుదురగా.. ఆ తర్వాత 2 మిలియన్లకు పెంచనుంది.