లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

మైనర్ బాలికపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారం-అరెస్ట్

Published

on

Bank manager rapes minor in MP, records video to blackmail : మైనర్ బాలికపై అత్యాచారం చేసి దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బ్యాంకు మేనేజర్ ను   పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని  ఇండోర్ లో జరిగిన ఈదారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొహాలీకి చెందిన ఒక మైనర్ కు, తన స్నేహితురాలి ద్వారా  53 ఏళ్ళ బ్యాంకు మేనేజర్ పరిచయం అయ్యాడు.

అప్పుడప్పుడు  అతను ఆ బాలికను షాపింగ్ కు తీసుకు వెళ్లేవాడు.  ఈ నేపధ్యంలో ఒకరోజు హోటల్ గదికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెపై  అత్యాచారం చేసాడు. ఆ ఘటన అంతా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ మైనర్ పై పలుమార్లు అత్యాచారం చేశాడు.  దీంతో విసుగు చెందిన బాధితురాలు పోలీసులకు  ఫిర్యాదు  చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని ఇండోర్ లో అరెస్ట్ చేశారు.   మైనర్ తన స్నేహితురాలిపై కూడాఫిర్యాదు  చేయటంతో ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. కేసు దర్యాప్తులో ఉంది.