Home » 2021 జనవరిలో 14రోజులు మూతపడనున్న బ్యాంకులు!
Published
2 months agoon
Banks closed for upto 14 days : కొత్త ఏడాది జనవరిలో బ్యాంకు పనులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే బీఅలర్ట్.. కొత్త ఏడాది 2021 జనవరిలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. మొదటి నెల జనవరిలో దాదాపు రెండు వారాల పాటు (14 రోజుల వరకు ) బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో, నాల్గో శనివారాలు, ఒకటి జాతీయ సెలవు దినోత్సవం కూడా ఉంది.
అయితే బ్యాంకుల సెలవు దినాలు ఒక్కో రాష్ట్రంలో వివిధ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్రకటనలో వెల్లడించింది. కస్టమర్లు ముందుగానే తమ బ్యాంకు సంబంధిత పనులను పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.
చివరి క్షణాల్లో ఇబ్బందులు పడటం కంటే ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని బ్యాంకు కస్టమర్లకు సూచించింది. బ్యాంకు సెలువు దినాల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం పనిచేస్తాయని పేర్కొంది.
2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 40 రోజులకు పైగా పనిచేయవని ఆర్బీఐ పేర్కొంది. దీనికి సంబంధించి నెగోషబల్ ఇన్ స్ట్రూమెంట్స్ యాక్ట్ కింద ఆర్బీఐ బ్యాంకు సెలవుదినాల తేదీలను వెల్లడించింది. బ్యాంకుల సెలువుదినాల వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.
– జనవరి 2, 16తేదీల్లో మాత్రమే Aizawl లో బ్యాంక్ హాలీడే
– 14వ తేదీల్లో అహ్మదాబాద్, చెన్నై, గ్యాంగటక్, హైదరాబాద్
– జనవరి 15, 2021న చెన్నై, గువహటిలో హాలీడే (Thiruvalluvar Day -Magh Bihu, Tusu Puja)
– జనవరి 23న అగర్తాలాలో బ్యాంకు హాలిడే (Netaji Subhas Chandra Bose జన్మదినం)
– జనవరి 25న ఇంపాల్ లో బ్యాంకు హాలీడే (Imoinu Iratpa)
– తొలి త్రైమాసికం 2021 (జనవరి-మార్చి)లో 19 సెలవుదినాలు
– ఆదివారాలు, రెండో, నాల్గో శనివారాల్లో కూడా బ్యాంకులకు సెలవు.
National Holidays :
01 January 2021- New Year’s Day
03 January 2021- Weekly off (Sunday)
09 January 2021- Second Saturday
10 January 2021- Weekly off (Sunday)
17 January 2021- Weekly off (Sunday)
23 January 2021- Fourth Saturday
24 January 2021- Weekly off (Sunday)
26 January 2021- Republic Day
31 January 2021- Weekly off (Sunday)
Regional Holidays :
02 January 2021- New Year’s celebration
14 January 2021- Makar Sankranti/Pongal/Maghe Sankranti
15 January 2021- Thiruvalluvar Day/Magh Bihu and Tusu Puja
16 January 2021- Uzhavar Thirunal
23 January 2021- Birthday of Netaji Subhas Chandra Bose
25 January 2021- Imoinu Iratpa
26 January 2021- Gaan-Ngai
ఎస్బీఐ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్, ఇక ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు
అమితాబ్, అక్షయ్‌లు హీరోలు కాదన్న కాంగ్రెస్ లీడర్
లాకర్లో ఉన్న వస్తువు పోయినా దెబ్బతిన్నా బ్యాంకులదే బాధ్యత
రూ.వెయ్యి మాత్రమే విత్ డ్రా చేయాలి, ఆ బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ షాక్
హోమ్ లోన్స్‌పై ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్
బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ఆర్బీఐతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది