తెలంగాణ వ్యాప్తంగా బార్లకు గ్రీన్ సిగ్నల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ‌లోని బార్లు, క్ల‌బ్బుల ఓనర్లకు గుడ్ న్యూస్. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా బార్లు, క‌బ్బుల‌ను మూసేయాల‌ని ప్ర‌భుత్వం 6 నెల‌ల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులు ఇప్ప‌టికే ఓపెన్ చేయగా.. దాదాపు ఆరు నెల‌ల‌ త‌ర్వాత తెలంగాణ‌లో బార్లు, క్ల‌బ్బులు ఓపెన్ కానున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాకపోతే ప్ర‌భుత్వం ప‌ర్మిట్ రూమ్‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

వాటితో పాటుగా బార్లు, క్ల‌బ్బుల‌లో మ్యూజిక‌ల్ ఈవెంట్స్, డ్యాన్స్‌ల‌ను నిషేధించారు. క‌రోనా నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆర్డర్ ఇచ్చింది. రూల్స్ పాటించ‌ని బార్లు, క్ల‌బ్బుల‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

పాటించాల్సిన నిబంధ‌న‌లు:

1. బార్లు, క్ల‌బ్బుల వ‌ద్ద థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్‌లు ఏర్పాటు చేయాలి.
2. వెంటిలేష‌న్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.
3. క్ర‌మ‌ప‌ద్ధ‌తి పాటించాలి, ప‌రిశుభ్ర‌త‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
4. బార్లు, క్ల‌బ్బుల సిబ్బందితో పాటు మిగ‌తా వారు క‌చ్చితంగా మాస్కు ధ‌రించాలి.
5. శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఉంచాలి.
6. మ్యూజిక‌ల్ ఈవెంట్స్, డ్యాన్స్‌ల‌పై నిషేధం.
7. ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రంతో పాటు ఒక వ్య‌క్తి మ‌ద్యం సేవించి వెళ్లిన త‌ర్వాత ఆ సీటును శానిటైజ్ చేయాలి.
8. పార్కింగ్ ఏరియాల్లో జ‌నాలు గుమిగూడ‌కుండా చూడాలి

Related Tags :

Related Posts :