Home » 6 వ ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్గా బసవతారకం : బాలకృష్ణ
Published
2 months agoon
By
sekharBasavatarakam Cancer Hospital: బసవతారకం ఆసుపత్రికి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయని, కరోనా సమయంలో అవార్డ్ రావడమనేది వైద్యుల శ్రమకు లభించిన గుర్తింపు అని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే, బసబతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు.
బసవతారకం ఆసుపత్రికి 6వ ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ అవార్డు లభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ బసవతారకం ఆసుపత్రికి ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. 2011లో 13వ స్థానం లభించిందని, 2020 నాటికి 6వ స్థానానికి చేరుకున్నామన్నారు.
దీనిని మొదటి స్థానానికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. కరోనా సమయంలో నిరుపేదల వైద్యం కోసం రూ. 3కోట్ల రూపాయలు కేటాయించామని, 3,200 ల మందికి కోవిడ్ చికిత్సనందించడం జరిగిందని తెలిపారు బాలయ్య.