లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సర్పంచ్ పదవి బీసీ : ఓటర్లు ఎస్సీలు, అభ్యర్థి విజయం ఎలా ?

Published

on

bc sarpanch : ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్ జరిగిపోయింది. అధికార పార్టీకి బలపరిచిన అభ్యర్థులే అధికంగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వింత వింత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా..గ్రామంలో ఎస్సీ కుటుంబాలు నివాసం ఉంటుంటే..సర్పంచ్ పదవి మాత్రం బీసీకి కేటాయించడంతో ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లిలో చోటు చేసుకుంది. జగ్గరాజుపల్లి గ్రామంలో అన్నీ ఎస్సీ కుటుంబాలే ఉన్నాయి. మొత్తం 677 మంది ఓటర్లున్నారు. ఇక్కడ సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించారు. ఓటర్లు మాత్రం ఎస్సీలు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దామతోటి ముని మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్ బీని వివాహం చేసుకున్నారు. ఆమెది బీసీ వర్గం కావడంతో..సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో…ఖాదర్ బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.