BCCI, IOA open to ending deals with Vivo, Li Ning

చైనా కంపెనీలతో లింకులు తెంచేసుకున్న BCCI, IOA

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

BCCI ఇక మీదట చైనా కంపెనీతో ఎటువంటి సంబంధాలు కొనసాగించబోమని స్పష్టం చేసింది. స్టేడియంల నిర్మాణానికి, ఇతర ఇన్‌ఫ్రాస్టక్చర్ కోసం చైనా కంపెనీతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి నో చెప్పేశారని క్రికెట్ బోర్డ్ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ అన్నారు. ఇందులో భాగంగానే చైనీస్ కమ్యూనికేషన్ కంపెనీ Vivo ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ నుంచి, Li-Ningను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అప్పారెల్ స్పాన్సర్ నుంచి తొలగించారు. 

భవిష్యత్ లోనూ వాటితో ఒప్పందాలు కుదుర్చకోబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి Vivoను కొనసాగిస్తామని ప్రభుత్వం అడిగితే ఏ సమయంలోనైనా టెర్మినేట్ చేసేందుకు సిద్ధమని అన్నారు. ‘భవిష్యత్ లోనూ చైనీస్ కంపెనీలకు ఎటువంటి కాంట్రాక్టులు ఇవ్వబోమని’ ధుమాల్ మీడియాతో అన్నారు. ఇవన్నీ గాల్వాన్ లోయలో 20మంది ఇండియన్ ఆర్మీ సైనికులను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద కాల్చి చంపినందుకు గానూ ఇండియా తీసుకున్న నిర్ణయం. 

చైనీస్ కంపెనీలకు సపోర్ట్ చేసే వాటిని, చైనాకు ఉపయోగపడే వాటి మధ్య తేడా కనుక్కోవాలి. స్పాన్సర్ షిప్ విషయానికి వస్తే.. మనం చైనా కంపెనీల నుంచి డబ్బులు తీసుకుంటున్నాం. డబ్బులు ఇవ్వడం లేదు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ లో రూ.2వేల 199కోట్లు ఐదేళ్లకు గానూ 2018లో ఒప్పందం కుదిరింది. 

‘ఇందులో 42శాతం డబ్బు ప్రభుత్వానికి ట్యాక్స్ ల రూపంలో వెళుతుంది. దీని ప్రకారం.. డబ్బును ఇండియా కోసమే వాడుతున్నామని తెలుస్తుంది కదా. ఆ డబ్బు ఇండియన్ క్రికెట్ కోసం. భారత ప్రభుత్వం కోసం వాడుతున్నారు. చైనా కంపెనీలు ఫోన్లను అమ్మి భారత వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాయి. ఒకవేళ మనం స్పాన్సర్ షిప్ కోసం డబ్బులు తీసుకోకపోతే అవన్నీ మళ్లీ చైనాకే వెళ్లిపోతాయి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. 

చైనా ఉత్పత్తులను, కంపెనీలను నిషేదించడానికి రెండు దారులు లేవు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నాం. పబ్లిక్ సెంటిమెంట్ మైండ్ లో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ఒక భారతీయుడిగా చైనీయులకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నా. వారెక్కడైతే బాగా నష్టపోతారో.. అక్కడే దెబ్బ కొట్టాలి’ అని ధుమాల్ అన్నారు. 

Read: మళ్లీ మైదానంలోకి శ్రీశాంత్.. రంజీల్లోకి తీసుకుంటారా?

Related Posts