BCCI planning to stage IPL 2020 between September 26 to November 08

సెప్టెంబరు నెలాఖరులో IPL 2020కి రెడీ అవుతోన్న BCCI 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మార్చి నెలలో జరగాల్సి ఉన్న IPL 2020ని బీసీసీఐ వాయిదా వేసింది. కరోనా మహమ్మారి అదుపు అవుతుందని భావించి ఏప్రిల్ 15వరకూ పొడిగించినప్పటికీ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి లీగ్ నిర్వహనే అనుమానస్పదంగా మారింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి జాతీయ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఐపీఎల్ ఊసే లేకుండా పోయింది. మళ్లీ లాక్ డౌన్ సడలింపులు తర్వాత బీసీసీఐ.. ఐపీఎల్ కోసం రంగం సిద్ధం చేసింది. 

అంతర్జాతీయంగా ఫ్యామస్ అయిన ఐపీఎల్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా దీనిపై బీసీసీఐ కొత్త నిర్ణయం తీసుకుందని ముంబై మిర్రర్ వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8వరకూ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. తేదీలు మార్చే అవకాశాలు లేకపోలేదు. 

ఐసీసీ షెడ్యూల్, క్రికెట్ ఆస్ట్రేలియాను సంప్రదించడంతో పాటు టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ చూసుకుని ఐపీఎల్ ప్లాన్ చేయనున్నారు. వేదికలుగా బెంగళూరు, చెన్నైలు మాత్రమే పరిశీలించనున్నారు. మిగిలిన ప్రదేశాల్లో వాతావరణం కంటే ఇవే బెటర్ అని భావిస్తున్నారు. 

ముంబై వేదిక కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. హోటల్స్ కు స్టేడియంకు వెళ్లేందుకు ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు తక్కువ. కానీ, మహారాష్ట్రలో కొవిడ్ 19కేసులు పెరుగుతుండటంతో ముంబైను అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో కేవలం ఐపీఎల్ బాధ్యతను రెండు రాష్ట్రాలకు అప్పగించే ప్లాన్ లో ఉంది బీసీసీఐ. 

ఈ మేరకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది. టోర్నమెంట్ కు ముందు స్టాఫ్, ప్లేయర్లు అనారోగ్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. హోటల్స్ బుకింగ్, చార్టర్డ్ విమానాలను స్టాండ్ బైలో ఉంచుకుంది. మ్యాచ్ లు అన్నీ క్లోజ్ డ్ డోర్స్ లోనే జరుగుతాయి. సెప్టెంబరులో జరిగేందుకు చేస్తున్న ప్లాన్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో..

ఒకవేళ ఐపీఎల్ 2020 క్యాన్సిల్ అయితే బీసీసీఐ రూ.4వేల కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. 

Related Posts