లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

త్వరపడండి: ఐపీఎల్ 2021 వేలానికి ప్లేయర్ల రిజిస్ట్రేషన్‌ డెడ్‌లైన్

Updated On - 12:27 pm, Sun, 17 January 21

IPL 2021: ఇండియన్ క్రికెట్ బోర్డు నేరుగా రాష్ట్రాల అసోసియేషన్స్ తో కమ్యూనికేట్ అవుతామని ఎటువంటి ఏజెంట్ల అవసరం లేదంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌కు గానూ.. వేలంలో పాల్గొనేందుకు ప్లేయర్లు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని డెడ్ లైన్ మరికొద్ది రోజులు మాత్రమే ఉందని వెల్లడించింది.

గత సీజన్లో ఆడిన ప్లేయర్లను అంటిపెట్టుకున్న మిగతా ప్లేయర్లను జనవరి 20 నాటికల్లా విడుదల చేయాలని చెప్పింది. ప్లేయర్లకు ఎటువంటి కాంట్రాక్ట్ లేకుండా ఐపీఎల్ 2021వేలానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఫిబ్రవరి 4వరకూ ఆన్‌లైన్ అగ్రిమెంట్లు సబ్మిట్ చేయాలని.. ఫిబ్రవరి 12వరకూ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తామని అంటున్నారు.

ఫిబ్రవరి 16న మినీ వేలం జరగనుంది. ‘ఈ ప్రోసెసింగ్ స్టేజ్‌లో బీసీసీఐ రాష్ట్రాల అసోసియేషన్స్ తో డైరక్ట్ గా డీల్ చేయాలనుకుంటుంది. ప్లేయర్ ఏజెంట్లు కానీ మేనేజర్లతో గానీ కమ్యూనికేట్ అయ్యేంత తీరిక లేదు. ప్లేయర్ ఏ దశలో అయినా ఫెయిల్ అయినట్లు అనిపిస్తే ఐపీఎల్ 2021 వేలం లిస్ట్ నుంచి అతని పేరును తీసేస్తారు’ అని ఓ లెటర్ లో బీసీసీఐ రాష్ట్రాల అసోసియేన్స్ కు చెప్పింది.

ఈ సీజన్ రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఆన్ లైన్ లోనే ఉండనుంది. దీని ప్రకారమే పాస్ వర్డ్, లాగిన్ ఐడీలను సపరేట్ మెయిల్ లో పంపిస్తారు. అందులో నుంచే ఫామ్ పూర్తి చేసి ఐపీఎల్ 2021 ప్లేయర్ వేలం అగ్రిమెంట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక మొత్తం ఆన్ లైన్ రిజిష్ట్రేషన్ సిస్టమ్ లో అప్ లోడ్ చేసేయాలి. ఒరిజినల్ ను రాష్ట్ర అసోసియేషన్ కు డెలివరీ చేస్తారు. ఒరిజినల్ వేలం అగ్రిమెంట్ పైన ఫిజికల్ సంతకం అనేది కచ్చితంగా ఉండాలి’ అని స్పష్టం చేసింది.