బైక్ నుంచి ఆటోవరకు ఒకటే బాదుడు.. భారీగా పెరిగిన ట్రాఫిక్ జరిమానాలు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Vehicle penalties :ఏపీ ప్రభుత్వం భారీగా వాహన జరిమానాలు పెంచేసింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై ఏపీలో వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒకే విధమైన జరిమానా విధించనుంది.

ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానా విధించనుంది. వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే రూ.5,000 జరిమానా విధించనున్నారు.సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు రూ.10 వేలు వరకు జరిమానా విధించనుంది. రేసింగ్ లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధిస్తారు.రేసింగ్ లో రెండోసారి పట్టుబడితే రూ.10వేలు జరిమానా విధిస్తారు. పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10వేలు జరిమానా విధించనున్నారు. ఓవర్ లోడ్ వాహనాలకు రూ.20వేలు వరకు జరిమానా విధించనున్నారు.అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే రూ.5,000, డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10,000 జరిమానా, రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5,000, రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేకపోతే మొదటిసారి రూ. 2,000, రెండోసారి ఉల్లంఘిస్తే.. రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Related Tags :

Related Posts :