లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

100ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షాన్ని వేర్లతో పెకిలించి వేరే చోటుకు తరలించారు… ఎందుకో తెలుసా?

Published

on

Kenya’s President Saves 100-year-old Fig Tree : కెన్యాలో 100 ఏళ్లనాటి వృక్షం ఒకటి రోడ్డు మధ్యలో ఉంది. అయితే దాన్ని అక్కడి నుంచి తొలగించాల్సిన పరిస్ధితి నెల్కొంది. పర్యావరణవేత్తల ఆందోళనతో అత్తి చెట్టును నరికివేయడానికి వీలు లేదని ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆ భారీ వృక్షాన్ని వేర్లతో సహా పెకిలించి మరో చోటుకి మార్పిడి చేసి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చెట్టు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో పాటు, ఆ దేశాధ్యక్షుని పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.కెన్యా రాజధాని నైరోబీలోని వైయాకివే ప్రాంతంతో ఈ పురాతమైన అత్తి(ఫిగ్ ట్రీ) చెట్టు ఉంది. ఇటీవల నైరోబి నగరంలో చైనా నిధుల సహాయంతో రహదారి నిర్మాణం చేపట్టారు. అయితే రోడ్డు మధ్యలో ఉన్న ఈ చెట్టును తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కానీ పర్యావరణవేత్తలు ఈ వృక్షాన్ని తొలగించవద్దని ఆందోళనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా కెన్యాలో అత్యధిక జనాభా కలిగిన కికుయు అనే జాతి సమూహానికి ఈ అత్తి చెట్టు పవిత్ర వృక్షం.ఆ దేశ అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఆ వృక్షాన్ని తొలగించటానికి వీలు లేదని ఆదేశాలను జారీ చేశారు. దేశాధ్యక్షుడి ఆదేశాల మేరకు రోడ్ ఏజెన్సీ, కెన్యా నేషనల్ హైవేస్ అథారిటీ సంయుక్తంగా చెట్టును అక్కడి నుంచి మరోచోటుకి మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆ వృక్షాన్ని వేర్లతో సహా పెకిలించి, వేరోచోటికి సురక్షితంగా తరలించారు. ఈ విషయం పై పర్యావరణవేత్త ఎలిజబెత్ వాతుతి మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ చెట్టు నగరం యెుక్క ఆకాంక్షలకు చిహ్నంగా నిలుస్తోందని పేర్కొన్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *