లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఆకట్టుకున్న బీటింగ్ రిట్రీట్

Published

on

Beating Retreat ceremony రిపబ్లికే డే సందర్భంగా వాఘా-అట్టారీ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ వేడుక విశేషంగా ఆకట్టుకుంది. భారత్‌, పాకిస్తాన్ దేశాల సైనికులు చేపట్టిన ప్రత్యేక సంయుక్త కవాతును తిలకించేందుకు ఎప్పటిమాదిరిగానే ప్రజలు హాజరై.. భారత సైనికుల్లో ప్రేరణ నింపారు. కొవిడ్‌ కారణంగా తక్కువ సంఖ్యలో ప్రేక్షకులను పెరేడ్‌ వీక్షించేందుకు అనుమతించారు.

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా వాఘా-అట్టారీ సరిహద్దు వద్ద ఉమ్మడి పెరేడ్ జరుగదని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, బీటింగ్‌ రిట్రీట్‌లో రెండు దేశాల సైనికులు నువ్వా నేనా అన్నట్లు చేసే పెరేడ్‌ ఎంతో ఉద్విఘ్నంగా ఉంటుంది. ఈ ప్రత్యేక పెరేడ్‌ను వీక్షించడం కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఒక రోజు ముందుగానే వాఘా సరిహద్దుకు చేరుకుని ఆ క్షణాల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటారు.