Published
1 month agoon
Beautician Sureka Judicial remanded to 14days : గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ప్రియురాలు సురేఖకు రిమాండ్ విధించారు. బ్యూటీషియన్ సురేఖను అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు ఆమెను బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దాంతో బ్యూటీషియన్ సురేఖకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
గుడివాడలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన డీఎస్పీ సత్యానందం.. ఎస్ఐ విజయ్‌కుమార్ ఆత్మహత్య వివరాలను వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్ వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.
పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. దేవినేని ఉమ వ్యాఖ్యలను ఖండించారు. పోలీసులను రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని సూచించారు. ఎస్ఐ మృతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఎస్ఐ విజయ్‌కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు సురేఖను అరెస్ట్ చేశారు.
నిన్న సురేఖను అదుపులోకి తీసుకుని విచారించిన గుడివాడ పోలీసులు… ఆమెపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా బ్యూటీషియన్ సురేఖతో ఎస్సై విజయ్‌కుమార్ కలిసి ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం ఎస్సై విజయ్ కుమార్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుంది. సురేఖ మొన్న రాత్రి సూసైడ్ చేసుకుంటానని బాత్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో కంగారుపడ్డ విజయ్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.