లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

BECIL లో 4 వేల ఉద్యోగాలు: దరఖాస్తు గడువు పొడిగింపు

Published

on

BECIL recruitment 2020 : apply online date extended for 4000 vacancies

బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) లో 4 వేల ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు జనవరి 11, 2020 తో ముగుసింది. తాజాగా దరఖాస్తు గడువును మార్చి 20, 2020 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పలు కారణాల వల్ల దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ గా పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
స్కిల్డ్ మ్యాన్ పవర్ ట్రైనీ ప్రోగ్రామ్ – 2000
అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ట్రైనీ ప్రోగ్రామ్ – 2000

విద్యార్హత : అభ్యర్థులు 8వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్,ఓబీసీ అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపికా విధానం : అభ్యర్దులను డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయసు : అభ్యర్ధుల వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకి వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 27,2019.
దరఖాస్తు చివరి తేది : మార్చి 20,2020.

Also Read | MLA: ‘నేను చచ్చిపోయాక నన్ను మర్చిపోకూడదు..అందుకే నా విగ్రహాలు చేయించా’

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *