before-telecasting-movie-on-army-advise-production-houses-to-get-noc-defence-ministry-to-cbfc1

సైనికులపై సినిమాలు చేయాలంటే NOC తప్పనిసరి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్మీ-సెక్యూరిటీ ఫోర్స్‌కు సంబంధించిన వెబ్ సిరీస్ లేదా సినిమాలు తీసే ముందు No Objection Certificate(NOC) తీసుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కొన్ని సినిమాల్లో సైనికుల యూనిఫాంపై తప్పు బ్యాడ్జీలు, నక్షత్రాలు కనిపించాయని వాటిని సీరియస్‌గా తీసుకున్నట్లు సైన్యం వెల్లడించింది. ఇంతకుముందు చాలాసార్లు అలాంటి కేసు బయటపడినా పట్టించుకోలేదని, అయితే సైన్యం అలాంటి తప్పులను పట్టించుకోలేదని, కానీ ఇటీవల వెబ్ సిరీస్‌లలో ప్రసారమయ్యే కంటెంట్ అన్ని పరిమితులను దాటుతున్నట్లుగా సైన్యాధికారులు అభిప్రాయపడ్డారు.



ఈ క్రమంలో సాయుధ దళాల(ANN)పై ఏదైనా వెబ్ సిరీస్ ఫిల్మ్ లేదా డాక్యుమెంటరీ చేయడానికి ముందు రక్షణ మంత్రిత్వ శాఖ NoC తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఇకపై నిర్మాత-దర్శకుడు ఎవరైతే సైన్యం ఆధారంగా ఒక సినిమా, వెబ్-సిరీస్ లేదా డాక్యుమెంటరీ తయారు చేస్తారో లేదా సైనికులకు సంబంధించిన పాత్రలను చూపిస్తారో దానికి వరే బాధ్యులు కావలసి ఉంటుంది.

ఈ మేరకు ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) అధికారికి స్పష్టంగా లేఖ రాసింది రక్షణశాఖ, ఏదైనా చిత్రం లేదా వెబ్-సిరీస్లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ముందు, రక్షణ మంత్రిత్వ శాఖ NOC అంటే ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’ కచ్చితంగా ఉండాలని అందులో పేర్కొంది. సినిమాలు లేదా వెబ్-సిరీస్లలో రక్షణ దళాల (అనగా ఆర్మీ, వైమానిక దళం మరియు నావికాదళం) ఇమేజ్ పాడుచేయకుండా ఉండటానికి CBFC అంటే సెన్సార్ బోర్డు జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది.

Related Posts