లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

హీరోయిన్ ఆఫర్స్‌పై సునీత ఆన్సర్ అదిరిందిగా..

Published

on

Sunitha Heroine: ప్రముఖ గాయని సునీత రెండో పెళ్లితో కొద్ది రోజులుగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో హీరోయిన్ కావడం గురించి సునీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1995 లో ‘గులాబి’ సినిమాలో ‘ఈ వేళలో నీవు’ అనే పాటతో సునీత పాటల ప్రస్థానం ప్రారంభమైంది.

అందమైన గొంతుతో పాటు అంతే అందమైన రూపం కలిగిన సునీతను కథఆనాయికగా నటించమని చాలామంది దర్శక నిర్మాతలు అడిగినప్పటికీ ఆమె నటించలేదు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగానే కొనసాగుతున్నారు. అయితే తాను హీరోయిన్‌గా నటించకపోవడానికి గల కారణం ఏంటనేది ఇటీవల బయటపెట్టారామె.

సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే హీరోయిన్‌గా ఆఫర్స్ వచ్చినా నటించలేదు.. ఇప్పుడు అవకాశం వస్తే చేస్తారా.. అని అడగ్గా.. ‘ఇప్పుడంతా బాగానే ఉంది కదా.. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మార్చడం అనవసరం కదా’.. అంటూ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.

సునీత తన ఉద్దేశం ఏంటనేది నేరుగా చెప్పకుండా ఇలా చమత్కరించి విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది.. పనిలో పనిగా ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు వెతుక్కుంటున్నారు.. అప్‌కమింగ్ హీరోయిన్లకు సునీత సమాధానం కనువిప్పు కలిగిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.