లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

World Record : ఒక పావురం ఖరీదు రూ.14 కోట్లు..!!

Published

on

Belgian pigeon ‘new kim’ rs. 14 crore : ఒక పావురం ఖరీదు ఎంతుంటుంది? మహా ఉంటే ఐదు లేక ఆరు వందల రూపాయలు ఉంటుందేమో. కానీ ఓ ఆడ పావురం రేటు వింటే దిమ్మతిరిగిపోతుంది. వేలు కాదు లక్షలు కూడా కాదు కోట్ల రూపాల ధర పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఏకంగా రూ. 14 కోట్ల రూపాయల ధర పలికింది. ఏంటీ నోరెళ్లబెడుతున్నారా? అంటే ఆ మాట వింటే ఎవరైనా చేసేది అదే. దాని రేటు అలా ఉంది మరి.ఇది మామూలు పావురం కాదు. రేసింగ్ పావురం. దాన్ని ‘న్యూ కిమ్’గా పిలిస్తారు. ఈ ఆడ రేసింగ్ పావురాన్ని చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 1.6 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14.11 కోట్లు) చెల్లించి దానిని కొనేసుకున్నాడు. బెల్జియంలోని పీజియన్ పారడైజ్ (పిపా) అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఈ పావురం ఏకంగా రూ.14కోట్ల రికార్డు ధర పలికింది.


ఓ పావురం ఇంత రేటుకు అమ్ముడుపోవటం సాధారణవిషయం కాదు. ప్రపంచ రికార్డుని బద్ధలు కొట్టింది ఈ ‘న్యూ కిమ్’ పావురం. కాగా గత సంవత్సరం ‘అర్మాండో’ అనే ఓ మగ కపోతం అదే నండీ పావురం 1.25 మిలియన్ యూరోలకు అమ్ముడుపోయిందని, ఇప్పుడా రికార్డును ‘న్యూ కిమ్’ బద్దలుగొట్టిందని పిపా సంస్థ తెలిపింది.


రెండేళ్ల వయసున్న ‘న్యూ కిమ్’ను 200 యూరోల బేస్ ప్రైస్‌తో వేలానికి పెట్టగా ఏకంగా 1.6 మిలియన్ యూరోలకు అమ్ముడుపోవడం గమనించాల్సిన విషయం. ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ఇంత భారీ స్థాయి ధరకు ఓ పావురం అమ్ముడైన దాఖలాలు లేవని పిపా చైర్మన్ నికోలస్ గైసెల్బ్రెచ్ట్ తెలిపారు. న్యూ కిమ్ పావురం వేలం గురించి నికోలస్ మాట్లాడుతూ..నిజానికి తాము ఆ పావురంకి ఇంత రేటు పలుకుతుందని అస్సలు అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘న్యూ కిమ్’ 2018లో జరిగిన ‘ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్’ పోటీల్లో విజేతగా నిలిచింది.


కాగా ఈ పావురం ఉత్తమ జాతికి చెందినది కావటంతో దాన్ని పోటీపడి అంత ధరకు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. న్యూ కిమ్ ప్రపంచంలోనే అత్యంత భారీ ధరకు పలికిన పావురంగా చరిత్ర సృష్టించింది. కాగా ఈ పావురం ప్రారంభ ధర 237 డాలర్ల నుంచి ప్రారంభై రోజులు గడిచేకొద్దీ రేటు పెరిగీ పెరిగీ చిరికి రూ.14కోట్లకు చైనాకు చెందిన వ్యక్తి సొంతం చేసుకున్నాడు.
ప్రముఖ తమిళ నటుడు ధనుష్ నటించి మారీ సినిమాలో పావురాలతో పోటీ చూసి ఉంటారు కదూ.పావురాలతో పోటీలు జరుగుతుంటాయి. ఈ పోటీల కోసం ఉత్తమ జాతి పావురాలను చాలా శ్రద్ధంగా పెంచుతుంటారు. వాటి అమ్మాకాలు చాలా భారీ స్థాయిలో జరుగుతుంటాయి.


కాగా బెల్జియంకు చెందిన హోక్ వాన్ డె వూవెర్ అనే వ్యక్తి పందేల్లో వాడే పావురాలను సేకరించి వాటికి ట్రైనింగ్ ఇస్తుంటారు. కొత్త జాతి పావురాలను సృష్టిస్తుంటారు. రేసుల్లో పాల్గొని విజేతగా నిలిచి పావురాలను Pipa అనే ఆన్ లైన్ సంస్థ ద్వారా వేలానికి పెడుతుంటారు. వీటిలో న్యూ కిమ్ అనే పావురం ఆన్ లైన్ వేలంలో రూ.14కోట్లకు అమ్ముడైంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *