Bengal cops use mustard oil, lemon water to battle Covid, claim many recovered with remedies

ఆవ నూనె, నిమ్మ నీరు తాగితే కరోనా తగ్గిపోతుంది.. బెంగాలీ పోలీసుల హోం రెమడీ !

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అసలే.. వర్షాకాలపు సీజన్.. వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్‌కు సీజన్ వ్యాధులు తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. వచ్చింది కరోనా? లేదా సాధారణ ఫ్లూ అనే విషయం తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అందరిలోనూ ఇలాంటి భయాందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించలేం. ప్రస్తుతానికి కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. నివారణ చర్యలు మాత్రమే కరోనా బారినపడకుండా కాపాడగలవని అంటున్నారు. 

అయితే… కరోనా సోకితే వెంటనే నయం చేసే అద్భుతమైన రెమిడీ ఒక ఉందంట. ఈ రెమిడీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. అధికారికంగా కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆవ నూనె, నిమ్మకాయ నీరు కోవిడ్‌ను నయం చేయగలదని బెంగాల్ పోలీసు అధికారుల బృందం పేర్కొంది. ఈ హోం రెమెడీస్ ఉపయోగించిన చాలా మంది కోవిడ్ లక్షణాల నుంచి ప్రయోజనం పొందారని తెలిపారు. ఈ నివారణకు సంబంధించి అధికారిక లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బెంగాల్ పోలీసు అధికారులు కొంతమంది.. కరోనావైరస్‌తో పోరాడటానికి కొత్త మార్గాలను కనిపెట్టారు. ఆవ నూనె, వేడి నిమ్మకాయ నీటితో పాటు ఇతర గృహ రెమిడీలు తాగడం వల్ల కరోనావైరస్ వెంటనే నయం అవుతుందని, కరోనాకు ఇదే చికిత్స చేస్తామని అధికారిక సమాచారంలో ఉంది. ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి పోలీస్ కమిషనరేట్‌లో సీనియర్ పోలీసు అధికారులు చేసిన విజయవంతమైన ప్రయోగం చాలా మందికి ప్రయోజనం చేకూర్చిందని అంటున్నారు. ఈ అధికారిక లేఖలో ఈ కింది విధంగా చేయడం ద్వారా కరోనావైరస్‌ను నయం అవుతుందని చెబుతున్నారు. 

ఆవ నూనె, నిమ్మను ఇలా వాడండి : 
– ఉడికించిన మెత్తని బంగాళాదుంపలు / పఫ్డ్ రైస్/ సలాడ్ పచ్చి ఆవ నూనెలో ముంచండి.
– ఆవ నూనెను నాసికా రంధ్రాలలో (ఇయర్ బడ్స్ సాయంతో) రోజూ మూడుసార్లు వేయండి.
– చికిత్సలో రోజుకు 4-5 సార్లు ఆవిరి పట్టాలి. 
– వేడి నిమ్మకాయ నీరు రోజుకు 4 సార్లు త్రాగాలి.
– వేడి నీరు, ఉప్పుతో రోజుకు 4 సార్లు  పుక్కిలించాలి.
– ప్రతిరోజూ హల్ది (పసుపు)తో కలిపిన పాలు త్రాగాలి.

ఆవ నూనెను ఉపయోగించడమనేది.. సాంప్రదాయ హోం రెమిడీల్లో జలుబు, దగ్గును నయం చేస్తాయని ఎప్పటినుంచో ఆచరణలో ఉంది. సిలిగురి కమిషనరేట్ పోలీసు సిబ్బంది, అధికారులు కూడా కరోనా వైరస్ నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు. కరోనావైరస్‌పై సిలిగురి పోలీస్ కమిషనర్ త్రిపురారీ అర్ధవ్ ఆచరించి సూచించిన పద్ధతి కూడా ఇదే. ఉత్తర బెంగాల్‌లోని CID పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కమిషనరేట్‌లోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ బంధువు, ఒక పోలీసు డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్, అతని భార్య COVID-19 వైరస్ సోకింది. 

ఇప్పుడా కమిషనర్ నుంచి చిట్కాలను చెబుతున్నారు. కమిషనరేట్‌లోని ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘మేము వైద్యులు కాదు… అయినప్పటికీ, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ హోం రెమెడీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నమ్ముతున్నాం. వీటిని కరోనా చికిత్సలో కూడా తీసుకోవాలని సహోద్యోగులను కోరింది. కరోనావైరస్‌తో పోరాడాలంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వైద్యం కోసం ఆవ నూనెను ఉపయోగించిన అధికారుల అనుభవాలను కూడా ఈ సర్క్యులర్ షేర్ చేసింది. 

నిమా భూటియా, డిసి ఈస్ట్, సిలిగురి పోలీస్ కమిషనరేట్ బంధువుకు జూన్ 2 ఉదయం నుంచి జలుబు, దగ్గు, తలనొప్పి ప్రారంభమైంది. తరచుగా జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా భయంతో ఆమె ఆందోళన చెంది తనను తాను ఒక గదిలో నిర్భందించుకున్నారు. అప్పటినుంచి paracetamol, sinarest, stopache, cough syrup తీసుకుంటున్నారు. అయినా కరోనా లక్షణాలు పోలేదు. ఆమె వెంటనే నిమా భూటియా సాయం కోరింది.

దాంతో హోం రెమిడీలను అనుసరించమని సలహా ఇచ్చారు.  ఆమె చెప్పినట్టుగా ఆవ నూనె, నిమ్మకాయ కలిపిన వేడి నీటిని తాగమని సూచించింది. రెండు రోజుల తరువాత పూర్తిగా కరోనా నుంచి ఆమె కోలుకున్నట్లు పోలీసుల చెబుతున్నారు. గత వారం, మొదటిసారి, సిలిగురి పోలీసులలో కరోనావైరస్ కేసు నమోదైంది. డార్జిలింగ్ జంక్షన్ సమీపంలో ఉన్న పోలీసు నివాసంలో నివసిస్తున్న పోలీసు డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ పాజిటివ్ అని తేలింది. 

అతని భార్య కూడా పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్ 12న, సుదేష్ తమంగ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్‌ను సంప్రదించారు. అతను వెంటనే హోం రెమిడీలు చేయాలని సూచించారు. సరిగ్గా వారి ఆరోగ్యం మరుసటి రెండు రోజుల తర్వాత మెరుగుపడటం ప్రారంభమైంది.

జూన్ 15న, సుదేష్ తమంగ్, అతని భార్య ఇద్దరూ పాజిటివ్ పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ వారికి తెలియజేసింది. అయినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు లేవు. జూన్ 16న ప్రోటోకాల్ ప్రకారం.. వారిని కరోనావైరస్ ఆస్పత్రికి తరలించినట్లు ఉత్తర బెంగాల్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారు జ్వరం, దగ్గు లక్షణాలు లేకుండా వైద్య పరిశీలనలో ఉన్నారు. మతపరమైన నివారణలను కూడా అనుసరిస్తున్నారు.

Related Posts