కరోనా టైమ్ లో జోరందుకున్న వ్యభిచారం…ఇద్దరి అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కాకుండా ప్రజలంతా భౌతిక దూరం పాటించండని ప్రభుత్వం మొత్తుకు చెపుతుంటే ఆడవారి శరీరాలతోనే వ్యాపారం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు.

కరోనా విపత్కర పరిస్ధితుల్లో, అయిన వారికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతో సరిపెట్టమని డాక్టర్లు చెపుతుంటే…ఏకంగా మహిళలతో శృంగారానికి ఏర్పాట్లు చేసి లక్షలు దండుకుంటున్నారు.  కర్ణాటక రాజధాని బెంగుళూరులో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు సిటీ క్రెం బ్రాంచ్ పోలీసులు.

బెంగుళూరు, యశ్వంతపుర లోని ఒక ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో సిటీ క్రెం బ్రాంచ్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు విటులను అరెస్టు చేసి, 5 గురు సెక్స్ వర్కర్లను రక్షించారు.

ఈ ముఠా వివిధ ప్రాంతాలనుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తోందని బెంగుళూరు జాయింట్ పోలీసు కమీషనర్(క్రైమ్) సందీప్ పాటిల్ చెప్పారు. గత వారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి వ్యభిచార కూపాల్లోని 27 మంది మహిళలను రక్షించినట్లు ఆయన తెలిపారు.

 

Related Posts