లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

ఇళ్లకు వెళ్లడం కంటే చావడమే బెటర్.. ఆకలి కడుపుతో మండుతున్న ఎండల్లో ప్రయాణం

Published

on

Better to die while going back home: Life on the highway for migrants

విదేశాల్లో ఉన్న భారతీయులను స్పెషల్ విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు తీసుకొస్తుంది కేంద్రం. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను వదిలేయలేదు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి సొంతగ్రామాలకు చేర్చే ప్రయత్నం చేస్తుంది. వీటిపై అవగాహన లేకనో.. లేదా రైలు టిక్కెట్లకు సరిపడ ఛార్జీలు లేకనో.. వలస కార్మికులు కాలినడకనే సొంతూరికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. 

పగలంతా దారుణంగా కాస్తున్న ఎండలో హైవేలపై కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ.. దీని కంటే చావడమే బెటర్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా పనిలేకుండా పోయింది. భార్యాపిల్లలతో సహా రోడ్డెక్కాడు కార్మికుడు. ప్రభుత్వాలు వారికి ఆహారం, షెల్టర్ ఏర్పాటు చేయలేకపోవడం కాలే కడుపుతోనే ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖాండ్, ఛత్తీస్‌ఘడ్, జమ్మూ అండ్ కశ్మీర్ లో జరుగుతునన సంఘటనలివి. 

జైపూర్-అజ్మీర్ హైవేలో ప్రయాణిస్తున్న కార్మికులతో మాట్లాడిన ఇండియా టుడే వారి విషాదగాథను వినింది. ఎండ నుంచి కాపాడుకోవడానికి ఏసీ కారులో జైపూర్ నుంచి అజ్మీర్ వెళ్లడానికి మూడు గంటల సమయం పడుతుంది. రోడ్లపై ఇదే ప్రయాణం చేసేందుకు వీలులేక వేల మంది కాలినడకన వెళ్తుండగా కొందరికి చెప్పులు కూడా లేని దుస్థితి. ఈ క్రమంలో రాత్రి 7గంటల 30 నిమిషాలకు వారిని కలిశారు మీడియా వాళ్లు. 

ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన గ్రామస్థులు నడుచుకుంటూ వస్తున్నారు. వారి ఒంటిపై కొద్దిపాటి గాయాలు, కాస్త బియ్యం, ఓ క్యాన్ లో నీరు అవే వారి ఆస్తులు. నాలుగు గంటల పాటు నడిచిన తర్వాత బ్రేక్ తీసుకుందామని ఆగారు. హైవే పక్కనే కూర్చుండిపోయారు. 

రామ్ కుమార్ అనే కార్మికుడు రోజుకు రూ.300 సంపాదించేవాడు. ‘పని లేదు. ఆదాయం లేదు. కాంట్రాక్టర్ కూడా తప్పించుకున్నాడు. మేమెలా బతకాలి. ఆకలితో పని లేకుండా ఇంటికి వెళ్లడం కంటే చావడమే బెటర్’ అని అంటున్నాడు. 

అదే గ్రూపులోని హమీర్‌పూర్‌కు చెందిన మున్నాలాల్ ఆరు రోజులుగా నడుస్తూనే ఉన్నాడు. మరో 12రోజులు నడిస్తేగానీ ఇంటికి చేరుకోలేడు. ‘మాకు ఉద్యోగాలిచ్చిన వ్యక్తి తిరిగి పంపేశాడు. రాజ్‌సమంద్ దగ్గర ఆయనకు రూ.35వేలు ఇచ్చాం. మాకు టెస్టులు కూడా చేశారు. ఏమైందో తెలీదు మమ్మల్ని పొమ్మన్నారు’ అని చెప్పుకొచ్చాడు. 

రామ్ ఖేలావన్ మూడేళ్లుగా ఉదయ్‌పూర్‌లో ఉంటున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ రోజుకు రూ.350 సంపాదిస్తున్నాడు. బీహార్లోని భభూవా జిల్లాలో అతని సొంత గ్రామం. ‘మా కాంట్రాక్టర్ పారిపోయాడు నా కుటుంబమంతా మా ఊళ్లోనే ఉంది. మేం చచ్చినా బతికినా ఇంటికి వెళ్లాల్సిందే. రాత్రిపగలూ నడుస్తున్నాం. రోడ్డుపై ఎవరైనా ఆహారం ఇస్తే తింటున్నాం. ఒక్కో రోజు అది కూడా లేకపోతే బిస్కట్లు తింటున్నాం’ అని తన బాధను వెల్లగక్కుతున్నాడు. 

రైళ్లు ఏర్పాటు చేశారు కదా.. అందులో ఎందుకెళ్లలేదని ప్రశ్నిస్తే రిజిస్ట్రేషన్ కోసం నాలుగు రోజులు శ్రమించినా పని అవలేదని.. తప్పని పరిస్థితుల్లోనే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామని అంటున్నారు. 

మార్బుల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న నందలాల్ 10రోజులుగా నడుస్తూనే ఉన్నాడు. ‘నా దగ్గర వంద రూపాయలు మాత్రమే మిగిలాయి. కాంట్రాక్టర్ మోసం చేసి మమ్మల్ని పొమ్మన్నాడు. ఎటువంటి ఆహార సదుపాయం కూడా కల్పించలేదు. మమ్మల్ని ఆపేశారు. ఆ తర్వాత పారిపొమ్మన్నారు. ఎవ్వరూ సాయం చేయలేదు. లాక్‌డౌన్ ఎత్తేసినా సరే పని కోసం ఎక్కడికి వెళ్లేది లేదని కుటుంబంతోనే ఉంటామని అంటున్నారు. 

300కు మందికి పైగా కార్మికులు ఎటువంటి ఫుడ్ లేకుండా ఎండలో హైవేపై నడుచుకుంటూ వెళ్తున్నారు. కాంట్రాక్టర్ల మోసం చేయడంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. రైళ్లు ఎక్కి గ్రామాలు చేరుకోవచ్చని అధికారులు చెప్తున్నా.. వారు నడుచుకుంటూనే వెళ్లడానికి కారణం రిజిష్ట్రేషన్ పద్ధతి అర్థం కాకపోవడం. పగలు మండిపోతున్న ఎండలు.. రాత్రుళ్లు హైవేలపై మెరుపువేగంతో దూసుకుపోతున్న ట్రక్కులతో పోరాడుతూ సాగిస్తున్న ప్రయాణం వాళ్లను ఇళ్లకు చేర్చాలని ఆశిద్దాం. 

Read Here>> ఓ వలస కూలీ దీన గాథ : రూ. 10 మిగిలాయి..ఇంటికి ఎలా వెళ్లాలి

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *