భారతే కాదు.. ఏయే దేశాల్లో శ్రీరామ స్మరణ వినిపిస్తోందంటే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రామాయణం.. ఇదో అపూర్వమైన గొప్ప పురాణ ఇతిహాసం.. హిందువుల ఆరాధ్య దైవంగా శ్రీరాముడిని కొలవడం పురాణ కాలంగా ప్రసిద్ధి.. ఒక్క రామాయణమే కాదు.. మహాభారతం కూడా భారతదేశానికి అత్యంత ప్రియమైన ఇతిహాసాలుగా చెబుతుంటారు. పురాణాల్లో రామాయణానికి సంబంధించి ఎన్నో వందలాది సంస్కరణలు ఉన్నాయి. ఒక్క ఉపఖండంలోనే కాదు.. భారత తీరాలకు సైతం శ్రీరామ నామ స్మరణ ప్రతిధన్విస్తోంది.

నీతిమంతుడైన రాజుగా మాత్రమేకాదు.. ఆదర్శ పాలకుడిగా రాముడి పురాణం అద్భుతమైనదిగా చెబుతుంటారు. ఆగ్నేయ, తూర్పు ఆసియాలో శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవముగా కొలుస్తుంటారు.. భారతదేశం మాత్రమే కాదు.. శ్రీరాముని నామ స్మరణ ప్రపంచ దేశాల్లోనూ వినిపిస్తోంది. మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలలో ప్రజలు, హిందువులు మాత్రమే కాకుండా, రాముడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.జపాన్, కొరియా, చైనాలోని సాంస్కృతిక సంప్రదాయాలు, మతపరమైన పద బంధాల్లో కూడా రామాయణం ప్రవేశించింది. నేపాల్ ప్రధానంగా హిందూ దేశం.. ఇక్కడ అనేక శ్రీరాముడి ఆలయాలు ఉన్నాయి. అక్కడ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతులను బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన హిందువులు కూడా పూజిస్తారు.

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని సంస్కృతులలో సైతం శ్రీరాముడు కొలువై ఉన్నాడని అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ముస్లిం దేశమైన ఇండోనేషియాలో నాలుగు విభిన్న రామాయణాలు ఉన్నాయంట. ఇప్పటీకీ అక్కడ శ్రీరాముడిని దైవత్వంతో భక్తిభావాలతో కొలుస్తున్నారంట.. మలేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, మయన్మార్, నేపాల్, చైనా, ఇరాన్లలో కూడా రామాయణం గొప్ప ఇతిహాసం సంస్కరణలు ఉన్నాయని మోడీచెప్పారు.సంప్రదాయాలు, సంస్కృతి ఎలా వ్యాపించాయంటే? :
భారతదేశం వేలాది ఏళ్లుగా అనేక సంస్కృతులు అభివృద్ధి చెందుతున్నదేశంగా అవతరించింది. భారతదేశ పాలకులు, వ్యాపారులు, పండితులు, సాధువులు తరచుగా ఇతిహాసాలు, సంస్కృతం గురించి బాగా ప్రావీణ్యం సాధించినవారే ఉన్నారు. ఆసియా ఖండమంతటా వీరు పర్యటించారు. సనాతన ధర్మం బోధనలు, సందేశాన్ని అందిస్తుంటారు.

ప్రపంచానికి వేదాలు, ఇతిహాసాల గురించి మరెన్నో బోధనలు చేశారు. వందల ఏళ్లుగా విదేశీ భూముల స్థానిక సంప్రదాయాలలో రామాయణం మార్గనిర్దేశంగా మారుతూ వచ్చింది. తమ స్వదేశీ కళ, హస్తకళ, వాస్తుశిల్పం, కథ చెప్పే శైలులతో వారి సొంత రామాయణాలను సృష్టించుకుంటూ వచ్చారు.ఆగ్నేయాసియాలో రామాయణం :
ఆగ్నేయాసియా, ఆసియాన్ దేశాల్లో రామాయణంపై సుదీర్ఘమైన విశ్వాసాన్నికలిగి ఉన్నాయి. ఇండోనేషియాలో, వాల్మీకి రామాయణం, గొప్ప తమిళ కవి కంబన్ రామాయణం రెండింటిలోని అంశాలను అందంగా తీర్దిదిద్దారు.. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా దేశమైనప్పటికీ కూడా ఇండోనేషియా రామాయణం కోసం అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది.. ఈ సందర్భంగా ఇతిహాసాన్ని నాటకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఇతర ఆగ్నేయా ఆసియా దేశాలు, భారతదేశం నుంచి ఇండోనేషియాకు వచ్చేవారంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు.

ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన బాలికి రామాయణాన్ని స్థానిక మాండలికంలోకి అనువదించే సంప్రదాయం ఉంది. క్రీ.శ 9వ శతాబ్దానికి ముందే ఇండోనేషియా ద్వీపం జావా రామాయణంతో ముడిపడి ఉందని నమ్ముతారు.. మలేషియా, వియత్నాం కూడా రామాయణంతో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాయనే చెప్పాలి.రామాయణం Malay వెర్షన్ అయిన Hikayat Seri Ramaలో 13వ, 15వ శతాబ్దాల మధ్య రచించారు. రెండవ సహస్రాబ్దిలో దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఇతిహాసం మౌఖిక సంస్కరణల ఆధారంగా 7వ శతాబ్దానికి చెందిన Tra Kieu Cham ఆలయంలోని రామాయణ రాతి పీఠం ద్వారా వియత్నాం ఇతిహాసం వివరించినట్టు చెబుతున్నారు. రామాయణంలో అత్యంత అద్భుతమైన రామ కావ్యాలను రాజధాని బ్యాంకాక్‌లోని థాయ్‌లాండ్ అత్యంత పవిత్రమైన బౌద్ధ ప్రాంతం ఉంది.. అందులో Wat Phra Kaew (Emerald Buddha)ఆలయంలో ఉన్నాయి.

ఇందులోనే కాంప్లెక్స్ చుట్టూ పొడవైన గోడను నిర్మించారు. దీనిపై అందమైన రామాయణ కుడ్యచిత్రాలు ఉన్నాయి. 8వ శతాబ్దానికి చెందిన ఈ కుడ్యచిత్రాలు కొన్ని ఇటీవలే చిత్రీంచారట… ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వీటిని మారుస్తుంటారు. ఇక్కడి రామాయణంలోని ప్రధాన పాత్రలను థాయ్ వెర్షన్‌లో సంస్కృతుల్లో ప్రతిబింబించేలా ఉంటాయని చెబుతుంటారు.

Related Posts