BG-3 seeds Dangerous to telangana farmers

ప్రమాదకరమైన బీజీ – 3 విత్తనాలు : తెలంగాణ రైతాంగానికి ముప్పు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రమాదకర గ్లైఫొసేట్ ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పుగా మారుతోంది. ప‌త్తి విత్తనాల‌కు గ్లైఫొసేట్ పూస్తుండ‌టంతో దాని ప్ర‌భావంతో ఇత‌ర పంట‌లూ నాశ‌న‌మ‌వుతున్నాయి. గ్లైఫొసేట్ అవశేషాలు బీజీ-3 త్రీ ప‌త్తి విత్తనం తెలంగాణ రైతుల పాలిట ప్రమాదకరంగా పరిణమించింది. 

పత్తి పంట‌ను ఆశించే శ‌న‌గ‌ప‌చ్చ పురుగును అరికట్టేందుకు త‌యారు చేసింది బిటి విత్త‌నం, మోన్ శాంటో ప్ర‌వేశ‌పెట్టిన బిజి వ‌న్, బిజి టూ లు చీడ‌పీడ‌ల‌ను నియంత్రించ‌కలేకపోయ్యాయి. అంతేకాకుండా ఈ రకాల విత్తనాలు హానిక‌ర‌మ‌ని తేలింది. దీంతో మూడేళ్ల క్రితం బిజి త్రీ పేరుతో మార్కెట్లోకి విత్త‌నాలు తెచ్చాయి కంపెనీలు. హెర్బిసైట్ టాల‌రెంట్ పేరుతో హెచ్ టి విత్త‌నాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. బిజి త్రీ గా వ్య‌వ‌హ‌రించే ఈ విత్త‌నాలు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి, రైతుకు న‌ష్టం చేస్తున్నాయ‌ని రైతు నేతలు అంటున్నారు. శాస్త్రవేత్తలు ఆధారాల‌తో నిరూపించారు. వీటికి ప్ర‌మాద‌క‌ర‌మైన గ్లైసిల్ అనే ర‌సాయ‌నం పూత వాడుతుండ‌టంతో విష‌పూరితంగా మారుతున్నాయంటున్నారు. 

తెలంగాణలో ఖరీఫ్‌ లో సాగ‌య్యే పంటల్లో ప‌త్తి సాగు విస్తీర్ణమే ఎక్కువగా ఉంటుంది.  గ‌త ఖరీఫ్‌లో 45 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ప‌త్తి సాగ‌ు చేశారు. ఆశించిన దానికంటే ప‌దిశాతం సాగు విస్తీర్ణం పెరిగింది.  దేశంలో పత్తి సాగు అత్యధికంగా సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ప్రధానం. దీంతో తెలంగాణపై ప్రపంచంలోని బహుళజాతి పత్తి విత్తన కంపెనీలు దృష్టిసారించాయి. బీజీ3లో వచ్చే కలుపు నివారణకు గ్లైపోసేట్‌ అనే ప్రమాదకరమైన పురుగుమందును వాడతారు. బీజీ3 పండిస్తున్నారంటే గ్లైపోసేట్‌ కచ్చితంగా వాడాల్సిందే. ఈ గ్లైపోసేట్‌ అత్యంత ప్రమాదకరమైంది. గ్లైఫొసేట్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ  నిర్ధారించింది. 

బీజీ3 పత్తి విత్తనంపై నిషేధం అమ‌లు పేరుకే అన్న‌ట్టుగా మారింది.. దీన్ని వినియోగిస్తే కేన్సర్‌ వ్యాధి వస్తుందని నిరూపితం అయినప్ప‌టికీ ఈ విత్త‌నాల‌ను విచ్చలవిడిగా మార్కెట్లో దొడ్డిదారిన అమ్ముతున్నారు. మ‌రి కొద్ది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్ ప్రారంభం అవుతుండ‌టంతో వీటిని రైతుల‌కు అమ్మేందుకు దళారులురెడీ అయ్యారు. బీజీ2కు బీజీ3 పత్తి విత్తనానికి తేడా గుర్తించని స్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని అక్రమదందాకు తెరలేపారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు కొన్ని చోట్ల దాడులు చేసి  బీటీ-3 విత్తనాలు అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేశారు.

గతేడాది కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణలో 15% బీజీ3 పత్తి సాగైంది. అనధికారికంగా చూస్తే దాదాపు 25% సాగవుతుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో సాగవుతున్నా వ్యవసాయశాఖ తూతూమంత్రపు చర్యలకే పరిమితమైంది. ఈ రకం పత్తి విత్తనాన్ని విక్రయించేవారిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తున్నారు. దీంతో బీజీ3 పత్తి విత్తన దందాకు చెక్‌ పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. 
 

READ  కొత్త ఓటర్లకు ఉచితంగా గుర్తింపు కార్డుల పంపిణీ  

Related Posts