రెండు రొట్టెలతో నెలకు రూ.70వేలు సంపాదన, వంటతోనూ ఉపాధి పొందొచ్చని నిరూపించిన పల్లెటూరి మహిళ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రెండు రొట్టెలు ఆమె జీవితాన్నే మలుపు తిప్పాయి. ఆ రొట్టెలు ఆమెకు ఉపాధి మార్గం చూపించాయి. ఆ రొట్టెలే.. నెలకు రూ.70 సంపాదన తెచ్చిపెడుతున్నాయి. ఇది నిజమేనా అనే సందేహం రావొచ్చు. అవును నిజమే. రెండు రొట్టెలతో ఓ మహిళ నెలకు రూ.70వేలు సంపాదిస్తోంది. వంట గదితోనూ ఉపాధి పొందొచ్చని ఆ మహిళ నిరూపించింది.

రెండు రొట్టెలు.. వారి జీవితాన్ని మలుపు తిప్పాయి:
హర్యాణాలోని నౌరంగాబాద్‌ అనే చిన్న పల్లెలో ఉండే బబితా అనే ఇల్లాలు ఒకరోజు రెండు రొట్టెలు చేసింది. ఆ రొట్టెలు ఆమె లైఫ్ ని టర్న్ చేశాయి. ఆమె చేస్తున్న పనిలో పొందిక చూసిన మరిది వీడియోలో షూట్‌ చేసి యూ ట్యూబ్‌లో పెట్టారు. అంతే, ఆమె వంటల విధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ వీడియోకు లక్షల మంది అభిమానులయ్యారు. కట్టెల పొయ్యి మీద వారానికి ఒకటి రెండు వంటలు చేసి వీడియోలు పెడుతున్న బబితకు యూట్యూబ్‌ నెలకు 70 వేల రూపాయలు ఇస్తోంది.

నౌరంగాబాద్‌ ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలోని ఓ ఇంటికి బబిత కోడలుగా వచ్చింది. ఆమె వంట బాగా చేస్తుంది. తినడానికే కాదు చూడటానికి కూడా బాగుంటుంది. మరది రంజిత్‌కి ఇది తెలుసు. వదిన చేసే వంట వీడియోలను యూట్యూబ్‌లో పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. యూ ట్యూబ్‌ వీడియో చానల్‌ ఎవరైనా ఎప్పుడైనా మొదలెట్ట వచ్చని తెలిశాక అతడు ఆగలేదు.

babita rotis

మొదటి వీడియో ఫ్లాప్‌:
రంజిత్‌ దగ్గర కేవలం పది వేల రూపాయల మామూలు ఫోన్‌ ఉంది. మొదటగా వదినను ఒప్పించి ‘పిండి బాగా కలపడం ఎలా’ అనే వీడియో చేశాడు. ‘ఇండియన్‌ గర్ల్‌ బబితాస్‌ విలేజ్‌’ పేరుతో వీడియో చానల్‌ ఓపెన్‌ చేసి మొదటిసారి దానిని అప్‌లోడ్‌ చేశాడు. అలా 2017లో వారి చానల్‌ మొదలైంది. అయితే మొదటి వీడియోను ఎవరూ పెద్దగా చూడలేదు.

మరిది ఈసారి ఒక ఎడిటింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ‘మృదువైన రొట్టెలు తయారు చేయడం ఎలా’ అని వదినతో వీడియో చేశాడు. ఆశ్చర్యం. రెండు రోజుల్లోనే దానికి పది లక్షల వ్యూస్‌ వచ్చాయి. వదిన, మరిది ఇద్దరూ స్టన్‌ అయ్యారు. ఇక వాళ్ల ప్రయాణం మొదలైంది.

babita cook

ఇల్లే సెట్‌:
బబిత ఇల్లు టిపికల్‌ భారతీయ పల్లెటూరి ఇల్లు. కట్టెల పొయ్యి, కిరోసిన్‌ స్టవ్, అలికిన పరిసరాలు… ఇలాంటివన్నీ వీడియోలో వచ్చేలా మరిది వంట వీడియోలు షూట్‌ చేస్తాడు. ఎక్కువమందికి అవి నచ్చుతున్నాయి. తల మీద ఘూంఘట్‌ను అలాగే ఉంచుతూ చకచకా వంట చేసే బబిత చేతి నైపుణ్యాన్ని కూడా ఎక్కువమంది చూడటానికి ఇష్టపడుతున్నారు.

నెలకు నాలుగైదు వంటలు చేసి వదిన, మరిది అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించారు. ‘మూలీ కె పరోఠే’, ‘పంజాబీ కడై పకోడా’, ‘గార్లిక్‌ ఆనియన్‌ చీజ్‌ పరోఠా’, ‘ఆలూ భుజియా’, ‘గమ్‌ లడ్డూ’లాంటి దేశీ వంటకాలు చూసి చేసుకునే అభిమానులు మెల్లగా పెరిగారు.

READ  మోడీ దెబ్బ..ప్రతిపక్షాలు అబ్బా : హర్యానా,మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

మొదటి పారితోషికం రూ.13,400:
యూట్యూబ్‌ చానెల్‌ మొదలైన ఆరునెలల తర్వాత యూట్యూబ్‌ ఆ చానెల్‌ను మానిటైజ్‌ చేయడం మొదలెట్టింది. బబిత అకౌంట్‌లో డబ్బు పడటం స్టార్ట్ అయ్యింది. అయితే అవన్నీ ఉత్తుత్తి డబ్బు అని నిజం డబ్బు కాదని స్నేహితులు చెప్పారు. కాగా, తొలి పారితోషికంగా రూ.13వేల 400 పడ్డాయి. అవి పడిన రోజు ఆ ఊరంతా ఒక వింతగా చెప్పుకున్నారు. కుటుంబం ఆనందానికి అంతే లేదు. ఆ తర్వాత నెలకు కచ్చితంగా నాలుగైదు కొత్త వీడియోలు అప్‌లోడ్‌ అయ్యేలా చూసుకున్నారు.

డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు:
యూ ట్యూబ్‌ నుంచి రెగ్యులర్‌గా డబ్బుపడటం మొదలైంది. కొన్నిసార్లు ఇరవై వేల లోపు పడేది. ఒక్కోసారి రెండు లక్షలు పడేవి. యావరేజ్‌గా చూసుకుంటే ఇప్పటికి వారికి నెలకు 60, 70 వేలు వచ్చినట్టు లెక్క. ఈ డబ్బుతో రంజిత్‌ మంచి ఫోన్లు, కెమెరా స్టాండ్లు, లాప్‌టాప్‌ కొన్నాడు. మిగిలిన డబ్బు ఎలాగూ కుటుంబానిదే.

ఇప్పటికి ఈ వదినా మరిది కలిసి 124 వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. దాదాపు నాలుగున్నర లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఈ చానల్‌కు ఉన్నారు. హర్యాణాలోని మారుమూల పల్లెటూళ్లో ఒక వంట గది నుంచి కూచుని ఇంత ఉపాధి పొందవచ్చు అని వీరు నిరూపించారు. అంతేకాదు వీరిద్దరూ ఇప్పుడు ఆ ఊరిలో సెలబ్రిటీలుగా మారిపోయారు. డబ్బు సంపాదించడం చాలా కష్టం అని అంతా భావిస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. టాలెంట్ ఉండాలే కానీ చాలా ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అని చెప్పడానికి ఈ వదిన-మరిదిలే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.


Related Posts