లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు – రివ్యూ

శ్రీనివాస రెడ్డి నటిస్తూ.. నిర్మాత మరియు దర్శకుడిగా పరిచయమవుతున్న‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ మూవీ రివ్యూ..

Published

on

Bhagyanagara Veedullo Gammathu - Review

శ్రీనివాస రెడ్డి నటిస్తూ.. నిర్మాత మరియు దర్శకుడిగా పరిచయమవుతున్న‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ మూవీ రివ్యూ..

శ్రీనివాస రెడ్డి.. కమెడియన్‌గా తనదైన శైలిలో అందరినీ నవ్విస్తూ కెరీర్‌లో దూసుకుపోతూ.. అడపాదడపా హీరోగా కూడా రాణించాడు. తొలిసారి హీరోతో పాటు నిర్మాతగా, దర్శకుడిగా మారి చేసిన సినిమా ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. మరి బోలెడంత కమెడియన్లతో మంచి సినిమాగా ప్రమోట్ చేయబడ్డ ఈ చిత్రం ఎలా ఉంది, కామెడియన్‌గా మంచి మార్కులు సాధించిన శ్రీను.. డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడా లేదా చూద్దాం..

కథ విషయానికొస్తే : 
శ్రీను, సత్య, శంకర్ ముగ్గురూ మంచి ఫ్రెండ్స్. ముగ్గురికీ యాక్టింగ్ అంటే ఇష్టం. అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆర్థికంగా పెద్దగా సపోర్ట్ లేని వీరికి ఒక యూట్యూబ్ ఛానల్‌లో నటించే అవకాశం రావడంతో డెమో షూట్ చేసి ఇస్తారు. అయితే, ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఒక అమ్మాయి ఉంటే బాగుంటుందని వెతికి చివరికి కోకిల అనే పిచ్చి అమ్మాయి బాగుంది అని ఫిక్స్ అయి ఆమెని ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ దగ్గరకు తీసుకువెళతారు.
ఇదిలా ఉంటే, శ్రీనుకి భూటాన్ లాటరీలో రెండు కోట్లు ప్రైజ్ మనీ వస్తుంది. కానీ లాటరీ గెలిచిన టికెట్ మాత్రం కనిపించదు. ఆ టికెట్ కోసం వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ముగ్గురు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారు. పోలీస్ ఆఫీసర్ స్వతంత్ర్య కుమార్ వాళ్లను అరెస్టు చేస్తాడు. ఈ లోగా మతిస్థిమితం లేని కోకిల ఆ షార్ట్ ఫిల్మ్ ఆఫీస్ నుండి బయటికి వచ్చి వీధుల్లో తిరుగుతుంటుంది. కేసులో ఇరుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ ఏమయ్యారు? కోకిల కథ ఏమయ్యింది? చివరికి శ్రీను, సత్య, పీటర్‌లకు భూటాన్ లాటరీలో గెలుచుకున్న డబ్బులు వచ్చాయా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

Image
నటీనటుల విషయానికొస్తే :
శ్రీ‌నివాస‌ రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ముగ్గురూ మంచి కామెడీ టైమింగ్ ఉన్న న‌టులే. అయితే డైరెక్షన్ కూడా భారం కావడం వల్లో ఏమో.. శ్రీ‌నివాస‌రెడ్డి త‌న పాత్ర‌కూ త‌గిన న్యాయం చేయ‌లేక‌పోయాడు. ఉన్నంతలో స‌త్య పర్వాలేదు అనిపించాడు… బ‌తుకు ఎడ్ల‌బండి కాన్సెప్టులో ష‌క‌ల‌క శంక‌ర్ బాగానవ్వించాడు. ఇక  చిత్రం శ్రీ‌నుకి చాలా కాలం తర్వాత ఓ మంచి  పాత్ర లభించింది. కానీ పాత్రకు న్యాయం చేసినట్టు అనిపించలేదు.. వెన్నెల కిషోర్‌ని య‌మ సీరియ‌స్‌గా చూపించారు. కానీ అందులో కామెడీ పండ‌లేదు. మిగిలిన పాత్ర ధారులు కూడా అంతంత మాత్రంగానే కనిపించారు.. 
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే :
శ్రీ‌నివాస రెడ్డికి న‌టుడిగా వంద శాంతం మార్కులు పడ్డా.. డైరెక్టర్‌గా మాత్రం ఏ మాత్రం ప్రాక్టీస్ లేకుండా ఫీల్డ్‌లోకి వచ్చినట్టు అనిపించింది. డైరెక్టర్‌గా శ్రీనివాస్ రెడ్డి ఇంకా  మెరుగ‌వ్వాల్సి ఉంది. అతడు ఎంచుకున్న క‌థాంశం బావున్నా స్క్రీన్‌ప్లేలో మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. నేరేష‌న్ తేలిపోయింది. ప‌ర‌మ్ రాసిన డైలాగులు అక్క‌డ‌క్క‌డా పేలాయి. ఈ సినిమాలో ఉన్న‌వి రెండే పాట‌లు. అవీ అంతగా మెప్పించ‌లేదు. నేప‌థ్య సంగీతం సో సో గానే  ఉంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకోలేకపోయింది… నిర్మాణ విలువలు కూడా  మెరుపులేం లేవు.. 
ఓవరాల్‌గా చెప్పాలి అంటే :
సత్య, షకలక శంకర్, వెన్నెల కిషోర్ లాంటి స్ట్రాంగ్ కమెడియన్స్ చేతిలో ఉన్నా వాళ్ళని సరిగా వాడుకోలేకపోయారు. దానికి తోడు అడుగడుగునా సోషల్ మీడియాలో ఆల్రెడీ పేలిన జోకులే వినిపించాయి.. అవి మరింత చిరాకు తెప్పించాయి. ఏది ఏమైనా టైటిల్‌తో, ట్రైలర్‌‌తో క్రియేట్ చేసిన అంచనాలను అందుకోవడంలో మాత్రం శ్రీనివాస రెడ్డి అండ్ టీమ్ విఫలమైందనే చెప్పాలి.

Image
ప్లస్ పాయింట్స్:
కథ
కామెడీ..

మైనస్ పాయింట్స్ :
మ్యూజిక్ 
స్క్రీన్‌ప్లే
సినిమాటోగ్రఫీ
విసిగించే సీన్స్..
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *