2,500 ఏళ్ల నాటి శివాలయం..రోజూ 3 సార్లు రంగులు మారే శివలింగం..

2,500 ఏళ్ల నాటి శివాలయం..రోజూ 3 సార్లు రంగులు మారే శివలింగం..

Maha Shivaratri  changes colour thrice a day Lingam:  ప్రపంచంలోనే కాదు ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు..సైంటిస్టులు కూడా ఛేదించలేని రహస్యాలు..మర్మాలు ఎన్నో..ఎన్నెన్నో.. అటువంటి మర్మాలు సైన్స్‌కి కూడా అందవు. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. అందులోను శివాలయాల్లో రహస్యాలకు కొదువ లేదు. వాటిలో ఓ శివాలయంలోని శివలింగం రోజుకు మూడు రంగుల్లోకి మారుతుంది..ఈ మహాశివరాత్రి పర్వదినాన తెలుసుకుందాం..ఆ అత్యద్భుత శివలింగం గురించి తెలుసుకుందాం..అదే రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ‘అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం’..

మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పరమశివుడి ఎన్నోదేవాలయాలు ఉన్నాయి. అటువంటి శివాలయాల్లో ‘అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం’ ఆలయంలోని శివలింగం రోజుకు మూడుసార్లు రంగులు మారుతుంది. ఉదయం వేళ ఒకలా… మధ్యాహ్నం మరోలా… రాత్రి ఇంకో రంగులో మారి కనువిందు చేస్తుంది. ఈ శివలింగం ఎలా వచ్చిందో, ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు. అంటే ఆ శివయ్య స్వయంభువుగా వెలసినట్లు చెబుతుంటారు.

ఉదయం వేళ సూర్యుడు ఉదయించాక… శివలింగం ఎరుపు రంగులోకి మారుతుంది. మధ్యాహ్నం కాగానే… కాషాయరంగులోకి మారిపోతుంది. రాత్రివేళ నలుపు రంగులోకి మారిపోయే ఈ దేశాలయం 2,500 ఏళ్ల నాటిదని స్థానికులతో పాటు చరిత్రకారులు చెబుతున్నారు.

ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని…కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా అచలేశ్వరుడు పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయం మహా శివరాత్రి పర్వదినాన భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో కళకళలాడిపోతుంటుంది.

అంచలేశ్వర లింగం రంగులు ఎందుకు మారుతోంది? అనే మర్మంపై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు. హేతు వాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా యత్నాలు చేశారు గానీ ఏమీ తేల్చలేకపోయారు. దీంతో అచలేశ్వరుడి మహత్యం మిస్టరీగా మిగిలిపోయింది.

ఈ ఆలయం అందం చూడటానికి రెండు కళ్లూ చాలవు. రాజస్థాని పాలరాళ్లతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం లోపల సగం గుడ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలు అని చెబుతుంటారు. ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే… ఆ నీరు మాయమవుతుంది..అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాల చెట్లు చంప పుష్పాల చెట్టు ఉంటుంది. ఇలా అచలేశ్వరుడి దేవాలయంలో వింతల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు..