రథసప్తమి నిర్ణయం

రథసప్తమి నిర్ణయం

ratha saptami auspisious date and time for 2021 : ఈ ఏడాది రధసప్తమి నిర్ణయంలో కొంత సందిగ్దత ఏర్పడింది భక్తులకు .. నిర్ణయ సింధు ప్రకారం

నిర్ణయ సింధౌః-
మాఘశుక్ల సప్తమీ
రథసప్తమీ|
సా అరుణోదయ వ్యాపినీ గ్రాహ్యా!

సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ|
అరుణోదయ వేలాయాం
తస్యాం స్నానం మహాఫలం||
ఇతి చంద్రి కాయం
విష్ణు వచనాత్

అరుణోదయ వేళాయాం శుక్లా మాఘస్య సప్తమీ|
ప్రయాగే యది లభ్యేత
కోటిసూర్య గ్రహైః సమా||
ఇతి వచనాచ్చ యత్తు
దివో దాసీయే
అచలా సప్తమీ దుర్గా
శివరాత్రిర్మహాభరః|
ద్వాదశీ వత్స పూజాయాం సుఖదా
ప్రాగ్యుతా సదా||
ఇతి షష్ఠీయుతత్వముక్తం!

తత్ యదా,
పూర్వేహ్ని
ఘటికాద్వయం షష్ఠీ,
సప్తమీ పరేద్యుః క్షయ వశాత్ అరుణోదయాత్పూర్వం సమాప్యతే తత్పరం జ్ఞేయం|
తత్ షష్ఠ్యాం సప్తమీ క్షయం ప్రవేశ్యారుణోదయే స్నానం కార్యం||

ఇత్యాది వచనముల చేత షష్టి తో కూడి ఉన్నసప్తమి శ్రేష్టము* అన్న వచనము సూర్యోదయ కాలంలో సూర్యోదయ కాలంలో రెండు ఘడియలు షష్ఠి ఉండి  సప్తమితిథి మరుసటి రోజు అరుణోదయం కంటే ముందు సమాప్తమైనప్పుడు మాత్రమే షష్ఠీ యుత రథసప్తమి ని గ్రహించవలెను.

అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే రథసప్తమి పర్వము ఆచరించవలెను. కావున గురువారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి తిథి లేనందున శుక్రవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి ఉన్నందున శుక్రవారమే(19-2-2021) రథసప్తమి పర్వము ఆచరించవలెను.