మకర జ్యోతి దర్శనం

మకర జ్యోతి దర్శనం

Makara Jyothi Darshanam : మకరజ్యోతి దర్శనం .. ముక్తికి సోపానమన్నది అయ్యప్పభక్తుల నమ్మకం. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది మకరవిళక్కు ఏర్పాట్లు చేసింది ట్రావెన్‌కోర్‌ దేవస్థానం. మండలకాలం పాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని.. శబరిమలకు చేరుకున్నారు ఎంతోమంది భక్తులు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సన్నిధానంలో మణికంఠుని దర్శనం కోసం.. మకర జ్యోతి దివ్యానుభూతి కోసం ఎదురు చూస్తున్నారు.

2021, జనవరి 14వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి..వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరిస్తారు. అనంతరం సాయంత్రం ఆరున్నరకు పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి..ఇరుముడి సమర్పించి..ధన్యోహం ఓ శబరీశా అంటూ మాటలకందని ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు స్వాములు.

పంబ, నీలికల్‌, పులిమేడ్‌ ప్రాంతాల్లో జ్యోతిని వీక్షించేందుకు ట్రావెన్స్‌కోర్‌ దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంటుంది. మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేపడుతారు. మకరజ్యోతి కనబడగానే..అయ్యప్ప స్మరణతో శబరిమల మారుమోగుతుంటంది