TTD : కరోనా టైం, తిరుమల శ్రీవారికి రికార్డు ఆదాయం

కరోనా సమయంలోనూ తిరుమల శ్రీవారికి రికార్డ్‌ ఆదాయం వస్తోంది.

TTD : కరోనా టైం, తిరుమల శ్రీవారికి రికార్డు ఆదాయం

Tirumala

Tirumala Tirupati : కరోనా సమయంలోనూ తిరుమల శ్రీవారికి రికార్డ్‌ ఆదాయం వస్తోంది. నిన్న ఒక్కరోజే తిరుమలేశునికి హుండీ ద్వారా 5కోట్ల 21లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గత 9 ఏళ్లలో ఒక్కరోజులో ఈ స్థాయిలో హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారి. గతంలో 2012 ఏప్రిల్‌ 1న స్వామివారికి అత్యధికంగా 5కోట్ల 73లక్షల హుండీ ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే ప్రథమం.

కరోనా కారణంగా తిరుమలలో భక్తులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిమిత స్థాయిలోనే భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా కంటే ముందు నాటి పరిస్థితి ఇంకా నెలకొనలేదు. ఈ సమయంలో తిరుమలేశునికి 5కోట్లకు పైగా ఆదాయం రావడం ఆసక్తిని రేపుతోంది. భక్తుల సంఖ్య తగ్గినా హుండీ ఆదాయం పెరిగింది. సాధారణంగా కరోనాకు ముందు రోజుల్లో కూడా రోజుకు హుండీ ఆదాయం 2కోట్ల లోపలే ఉండేది.

కరోనా కారణంగా తిరుమల హుండీ ఆదాయం ఇటీవల భారీగా తగ్గింది. కొన్ని నెలల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. తర్వాత ఆంక్షలు సడలించినా.. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. వృద్ధులు, చిన్నారులపై ఆంక్షలు విధించారు. ఇటీవలే వృద్ధులను కూడా అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా అదుపులోకి వస్తే పూర్తిస్థాయిలో భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది.