ముక్కుద్వారా కరోనా వ్యాక్సిన్ తయారీపై అమెరికా యూనివర్శిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం అమెరికా యూనివర్శిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

సింగిల్ డోస్ ఇంట్రానాసల్ (ముక్కు ద్వారా ఇచ్చే) ‘chimp-adenovirus’ వ్యాక్సిన్ కోసం బుధవారం అమెరికాలో సెయింట్ లూయిస్ వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ లైసెన్స్ ఒప్పందం కుదిరింది.అందిన నివేదిక ప్రకారం.. సిటీ ఆధారిత వ్యాక్సిన్ మేకర్ భారత్ బయోటెక్.. ఈ వ్యాక్సిన్ తయారీ తర్వాత అమెరికా, జపాన్, యూరప్ మినహా అన్ని మార్కెట్లలో పంపిణీ చేసేందుకు హక్కులు సొంతం చేసుకుంది.

వ్యాక్సిన్ తయారీలో భాగంగా ముందుగా తొలి వ్యాక్సిన్ ట్రయల్స్‌ను St Louis University’s Vaccine, Treatment Evaluation Unitలో భారత్ బయోటెక్ నిర్వహించనుంది.అయితే దీనికి సంబంధించి రెగ్యులేటరీ అప్రూవల్ రావాల్సి ఉంది. తదుపరి స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ భారత్ వేదికగా జరుగనున్నాయి. Adenoviruses జంతువుల నుంచి సంక్రమించే వైరస్‌లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి.ఒక కోవిడ్-19 మాత్రమే కాదు.. ఎబోలా వైరస్, ట్యుబర్ క్యూలోసిస్ వంటి ప్రాణాంతక వైరస్ లపై కూడా జరిగాయి. ఇవన్నీ సురక్షతమే కాదు.. సామర్థ్య పరంగా ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ, ఈ వ్యాక్సిన్లను ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇవ్వడంపై ఇప్పటివరకూ చాలా తక్కువగా పరిశోధనలు జరిగాయి.

Related Posts