భరతమాత కూడా “మీటూ” బాధితురాలే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భరతమాత కూడా మీటూ బాధితురాలేనంటూ చెన్నై లయోలా కాలేజీలో ఈ నెల 19,20 తేదీల్లో నిర్వహించిన ఆర్ట్ ఫెస్టివల్ లోని ఓ పెయింటింగ్ వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీని కించపరిచేలా పెయింటింగ్ లు ఉండటం వివాదానికి దారి తీసింది. స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన  ఆర్ట్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన కొన్ని పెయింటింగ్ లు, వాటి క్యాప్షన్లు   భరతమాతను, ప్రధాని, బీజేపీని కించపరిచేలా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆక్మే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడం కోసం ఉద్దేశించిన ఈ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది.

 భరతమాత కూడా మీటూ బాధితురాలే, ప్రధాని మోడీ సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తున్నారు, గౌరీ లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఉంది అంటూ కొన్ని పెయింటింగ్ లకు వివాదాస్పద క్యాప్షన్లు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాలేజీ మేనేజ్ మెంట్ పై పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు.  స్ట్రీట్ అవార్డ్స్ అంటే దేశ ప్రధానిని, జాతీయ చిహ్నాలను, భరతమాతను అవమానించడమేనా అంటూ బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతి వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు అనుమతిస్తున్నారంటూ కాలేజీ మేనేజ్ మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీకి కేటాయించిన నిధులను రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని తాము కోరుతామని తెలిపారు. దీంతో లయోలా కాలేజీ మేనేజ్ మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. కాలేజీ ప్రాంగణాన్ని తప్పుడు కార్యక్రమాల కోసం దుర్వినియోగం చేసినందుకు తామెంతో భాధపడుతున్నామని, క్షమించమని కోరింది. అయితే కాలేజీ క్షమాపణను తాము అంగీకరించబోమని, రెండు రోజుల పాటు వివాదాస్పదమైన పెయింటింగ్ లను ప్రోత్సహించించారని అన్నారు.  

Related Posts