ఆన్ లైన్ లో పరిచయం……మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Online friends : ఆన్ లైన్ లో పరిచయం అయిన ముగ్గురు వ్యక్తులు 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నివసించే 12 ఏళ్ళ బాలిక ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుకునేది. ఆ సమయంలో ఆమెకు కొందరు పరిచయం అయ్యారు. వారిలో దాదాపు 20 మందివ్యక్తులు ఆమెతో నిత్యం చాటింగ్ చేసేది.

ఆన్ లైన్ లో పరిచయం అయిన స్నేహితుల్లో ముగ్గురు వ్యక్తులు, గత నెలలో తాము ఉండే రంభనగర్ ప్రాంతానికి రావాలని బాలికను కోరారు. వారి కోరిక మేరకు అక్కడకు వెళ్లిన బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వారంతా18-19 ఏళ్ల మధ్య వయస్కులే. అత్యాచారం చేస్తున్న సమయంలో దాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశారు.అనంతరం ఆ వీడియోను చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. తాము చెప్పినట్లు వచ్చి …తమతో గడపక పోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులతో పాటు బాలిక వద్ద నుంచి విడతల వారీగా వారు బెదిరించి నగదు కూడా తీసుకున్నారు.

దీంతో బాలిక ఈవిషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్టోబర్14 రాత్రి ఆముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (2 ఎన్) (పదేపదే అత్యాచారం), 376 (డీఏ) (16 ఏళ్లలోపు బాలికపై సామూహిక అత్యాచారం) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు), మరియు రక్షణ నిబంధనల కింద, మరియు పిల్లలపై లైంగిక నేరాలు (పోక్సో) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు ఇన్స్పెక్టర్ అలోక్ శ్రీవాత్సవ చెప్పారు.
హైదరాబాద్ లోనూ ఇదే తరహా ఘటన
కాగా…హైదరాబాద్ కూకట్ పల్లిలోనూ ఇదే తరహ ఘటన జరిగింది. మైనర్ బాలికతో స్నేహం చేసిన ముగ్గురు మైనర్లు ఆమెను బర్త్ డే పార్టీకి పిలిచారు. బర్త్ డే పార్టీలో ఏర్పాటు చేసిన కేక్ లో మత్తు మందు కలిపి బాలికతో తినిపించారు. బాలిక స్పృహ తప్పి…అపస్మారక స్ధితిలోకి చేరుకోగానే ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు.బాలిక స్పృహలోకి వచ్చి అడగ్గా….. ఈవిషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించారు. బాలిక తీవ్ర అస్వస్ధతకు గురవ్వటంతో తల్లితండ్రులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో తల్లితండ్రులు నిలదీయటంతో బాలిక తనపై జరిగిన అత్యాచారాన్ని వివరించింది. బాలికపై అత్యాచారానికి ఒడి గట్టిన జోసెఫ్, రాము, నవీన్ అనే మైనర్ బాలురపై జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును విచారణ నిమిత్తం సైబరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు.

 

Related Tags :

Related Posts :