Home » బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం : మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన శివరాజ్ సింగ్
Published
10 months agoon
మధ్యప్రదేశ్ సీఎంగా ఇవాళ(మార్చి-23,2020) బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ లాల్జీ టాండన్ చౌహాన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మంగళశాసనాలను ఫోన్ ద్వారా చౌహాన్ తీసుకున్నారు. 2005 నవంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చౌహాన్…నాలుగోవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.
జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయిన కమల్ నాథ్..గత గురువారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ లో ఎస్పీ,బీఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దుతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమల్ నాథ్…రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో విఫలమవడంతో బలపరీక్షకు వెళ్లకుండానే తన సీఎం పదవికి రాజీనామా చేశాడు. ఈ సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దుతు ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఆదివారం బీజేపీలో చేరినట్లు 18సంవతర్సాలు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని,ఇటీవల బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా నిన్న ట్వీట్ చేశారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినట్లు ఇప్పటికే స్పీకర్ ఎన్ ప్రజాపతి ప్రకటించిన విషయం తెలిసిందే.
Bhopal: BJP’s Shivraj Singh Chouhan takes oath as the Chief Minister of #MadhyaPradesh, at Raj Bhavan. pic.twitter.com/nJuy5TCQR2
— ANI (@ANI) March 23, 2020