bhopal-child-sex-racket-2-more-minors-accuse-newspaper-owner-of-rape.1

భోపాల్ చైల్డ్ సెక్స్ రాకెట్, న్యూస్ పేపర్ యజమాని తమను రేప్ చేశాడన్న మరో ఇద్దరు బాలికలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో వెలుగు చూసిన చైల్డ్ సెక్స్ రాకెట్ కేసు దేశవ్యాప్తంగా సంచనలం రేపుతోంది. ఈ సెక్స్ రాకెట్ కేసు విచారణలో రోజుకో వాస్తవం వెలుగులోకి వస్తోంది. రోజుకో బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. న్యూస్ పేపర్ యజమాని అఘాయిత్యాలను బయటపెడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు మైనర్ బాలికలు పోలీసులను ఆశ్రయించారు. హిందీ డైలీ న్యూస్ పేపర్ యజమాని, 68ఏళ్ల జర్నలిస్టు ప్యారే మియాన్ తమను రేప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్యారే మియాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడిపై పోలీసులు రూ.30వేలు రివార్డు కూడా ప్రకటించారు.

పేదింటి ఆడపిల్లలే ఆ కామాంధుడి టార్గెట్:
ఓ హిందీ డైలీ న్యూస్ పేపర్ నడుపుతున్న జర్నలిస్ట్ ప్యారే మియాన్ రేప్, సెక్స్ రాకెట్ కేసులో బుక్కయ్యాడు. ప్యారే మియాన్ తో పాటు అతడికి సహకరించిన స్వీటీ(21) అనే యువతి పైనా పోలీసులు కేసు పెట్టారు. ప్యారే మియాన్ పరారీలో ఉండగా స్వీటీని అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ, పోక్సో చట్టాలలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు భోపాల్ పోలీసులు తెలిపారు. బాలికల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఈ కామాంధుడు దారుణాలకు ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. తన లైంగిక కోరికలు తీర్చుకోవడమే కాకుండా బాలికలతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నాడు ఆ నీచుడు.

Bhopal child sex racket: 2 more minors accuse newspaper owner of ...

బాలికలపై అత్యాచారం, సెక్స్ రాకెట్:
ఇప్పటివరకు ఏడుగురు మైనర్ బాలికలు ప్యారే మియాన్ పై రేప్ ఆరోపణలు చేశారు. ప్యారే మియాన్, అతడి గ్యాంగ్ తమపై కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నట్టు బాధితులు వాపోయారు. పోలీసుల విచారణలో ప్యారే మియాన్ చైల్డ్ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు తేలింది. బాధితుల్లో చాలామంది బాలికలు పేద కుటుంబాలకు చెందిన వారు. వారి బాగోగులు నేను చూసుకుంటాను, వారిని పెంచి పెద్ద చేస్తాను, వారికి పెళ్లి కూడా చేస్తానని, వారి పెద్దలతో చెప్పి ఆడపిల్లలను తన వెంట తీసుకెళ్తాడు ప్యారే మియాన్. తల్లిదండ్రులతో మంచి మాటలు చెప్పే ప్యారే మియాన్ వాస్తవానికి పరమ నీచుడు, కామాంధుడు. మైనర్ బాలికలతో తన లైంగిక కోరికలు తీర్చుకుంటాడు. అంతేకాదు వారితో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నాడు.

Pyare Miyan ke ghar mein ghusi police, mili lakhon ki videshi ...

బాలికలు పారిపోకుండా మద్యం తాగించారు:
కొన్ని రోజుల క్రితం(జూలై 12,2020) పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. రతిబార్ ప్రాంతంలోని ఓ పాత బంగ్లా ఉంది. ఆ భవనం ఓ హిందీ డైలీ న్యూస్ పేపర్ యజమానిది. ఆ బంగ్లాపై పోలీసులు రైడ్ చేశారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా, రూమ్ లో సోఫాపై ఆరుగురు బాలికలు మద్యం మత్తులో తూలుతూ, ఊగుతూ కనిపించారు. పోలీసులను కూడా గుర్టుపట్టే స్థితిలో వారు లేరు. పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు బాలికల్లో ఓ బాలిక… తనను భవన యజమాని, ప్యారే మియాన్ రేప్ చేశాడని పోలీసులకు స్టేట్‌మెంట్‌లో చెప్పింది. దాంతో పోలీసులు విచారణ చేపట్టగా ప్యారే మియాన్ నిజస్వరూపం బయటపడింది.

READ  ఆజాంఘర్‌ : పోలీసులపై రాళ్ల దాడి ఘనటలో 19 మంది అరెస్ట్‌

Bhopal High Profiles Juvenile Molestation Case journalist pyare ...

సెక్స్ రాకెట్ నడుపుతున్న జర్నలిస్ట్:
ప్రస్తుతం బాలికలను సిటీ చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించారు పోలీసులు. ప్యారే మియాన్ తమను వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి బలవంతంగా సెక్స్ రాకెట్‌ నడుపుతున్నట్లు బాలికలు తెలిపారు. సెక్స్ రాకెట్ జరుగుతున్నది ఆ భవనంలో కాదనీ వేరే చోట ఇదంతా చేస్తూ ఆ రోజు మరో ప్రత్యేక అవసరం కోసం ఆరుగుర్నీ అక్కడికి తరలించారని పోలీసులకు తెలిసింది. ఆ రోజు రాత్రి షాపురా ఏరియాలో జరిగే బర్త్‌డే పార్టీలో డాన్స్ చేయించడం కోసమే వాళ్లను అక్కడకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. భవనం నుంచి ఎవరూ పారిపోకుండా అందరితో మద్యం తాగించి వాళ్లను అక్కడ బంధించారు. బాలికలను ప్రశ్నించినప్పుడు మరో విషయం కూడా తెలిసింది. వాళ్లను ఇంతకుముందు కూడా చాలా పార్టీలకు తీసుకెళ్లి మద్యం తాగించారట. తెరవెనక సెక్స్ రాకెట్ నడుస్తోందని తెలుసుకున్న పోలీసులు ప్యారే మియాన్ ఏజెంట్లు ఎవరు? బాలికలను ఎలా ఈ రాకెట్‌లో దించుతున్నారు? వంటి విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

Sexual Exploitation of Minors in Bhopal Case Updates; Demolished ...

సీఎం ఆదేశాలతో న్యూస్ పేపర్ లైసెన్స్ క్యాన్సిల్:
చైల్డ్ సెక్స్ రాకెట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ప్యారే మియాన్ నడుపుతున్న న్యూస్ పేపర్ లైసెన్స్ ను అధికారులు క్యాన్సల్ చేశారు. అలాగే ప్యారే మియాన్ అక్రిడేషన్ రద్దు చేశారు. అంతేకాదు అతడికి కేటాయించిన ప్రభుత్వ బంగ్లాని వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఓ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్యారే మియాన్ నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చేశారు. సెక్స్ రాకెట్ గ్యాంగ్ ని వదిలి పెట్టొద్దని, అందరిని పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

Related Posts