Home » International » ఎక్కడ, ఎప్పుడు : అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
Updated On - 6:38 am, Wed, 20 January 21
Biden sworn : అమెరికా చరిత్రలో మరో కీలక ఘట్టానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా నిబంధనలు, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమం ఇదివరకటి కన్నా భిన్నంగా ఉండబోతోంది. ఇనాగురేషన్ పేరుతో అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వాషింగ్టన్ డీసీలో ఇది జరుగుతుంది. ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే బైడెన్ అధికారికంగా అమెరికాకు 46వ అధ్యక్షుడు అవుతారు. సాధారణంగా అధ్యక్ష పదవి కన్నా ముందే ఉపాధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం జరుగుతుంది.
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం పది గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. అంటే ఇండియన్ టైమింగ్స్‌లో 2021, జనవరి 20వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. అమెరికా టైమింగ్స్‌లో ప్రారంభోపన్యాసం 11 గంటల 30 నిమిషాలకు జరుగుతుంది. భారత్‌లో ఇది రాత్రి 10 గంటలకు మొదలువుతుంది. ఆ తర్వాత బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. క్యాపిటల్ వెస్ట్ ఫ్రంట్‌లో బైడెన్ చేత చీఫ్ జస్టిస్ జాన్ జీ రాబర్ట్స్ జూనియర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
కొత్త అధ్యక్షుడు తన ప్రారంభ ప్రసంగం చేసిన తర్వాత.. సాంప్రదాయ కవాతుకు బదులుగా ఉపాధ్యక్షుడు, వారి కుటుంబాలు మైలు దూరంలో ఉన్న వైట్‌హౌస్‌కు వెళ్తారు. కరోనాతో చనిపోయిన అమెరికా హీరోలకు నివాళులర్పిస్తారు. దీని కోసం లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ చుట్టూ లైటింగ్ వేడుకను నిర్వహించనున్నారు. ఇది కూడా వర్చువల్ పరేడ్గానే సాగనుంది.
ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు
బైడెన్ మరో కీలక నిర్ణయం.. గ్రీన్ కార్డు అప్లికేషన్స్‌పై నిషేధం ఎత్తివేత
ఇంటర్నెట్ స్లోగా ఉందని పేపర్లో యాడ్ ఇచ్చిన 90ఏళ్ల వ్యక్తి.. ఏకంగా 10వేల డాలర్లు ఖర్చుపెట్టాడు!
పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం, ఇదే తొలిసారి
కొలువుదీరిన జీహెచ్ఎంసీ పాలకమండలి..నాలుగు భాషల్లో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం
జో బైడెన్ ను కదిలించిన మహిళ లేఖ..స్వయంగా ఫోన్ చేసి తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్న అమెరికా ప్రెసిడెంట్