లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అధ్యక్షుడిగా బైడెన్ ను ధృవీకరించిన కాంగ్రెస్..అధికార బదిలీకి సహకరిస్తానన్న ట్రంప్

Published

on

Donald Trump pledges ‘orderly’ transfer of power to Joe Biden on January 20 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ముగిసింది. డెమొక్రటిక్​ నేత జో బైడెన్​ను తదుపరి అధ్యక్షుడిగా, కమలా హారిస్​ను ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్)​ ధ్రువీకరించింది. ఎలక్టార్​ కాలేజీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఇక ఈ నెల 20న బైడెన్​, హారిస్​ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించకూడదని నిర్ణయించారు.

అయితే, అధ్యక్షుడిగా బైడెన్​ ధ్రువీకరణ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. ఎలక్టార్​ కాలేజీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఊహించని రీతిలో అడ్డంకి ఏర్పడింది. వేలాది మంది ట్రంప్​ మద్దతుదారులు వాషింగ్టన్ లోని క్యాపిటోల్ హిల్(పార్లమెంటు)లోకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. దాదాపు నాలుగు గంటల పాటు నిలిచిపోయిన కాంగ్రెస్​.. పరిస్థితి అదుపులోకి వచ్చాక.. బైడెన్​ను అధ్యక్షుడిగా ధ్రువీకరించింది. బైడెన్​కు 306 ఎలక్టార్​ కాలేజీ ఓట్లు లభించినట్టు తెలిసింది.

మరోవైపు, ఎట్టకేలకు అధికార బదిలీ ప్రక్రియకు సహకరించేందుకు అధ్యక్షుడు ట్రంప్​ ఒప్పుకున్నారు. కాంగ్రెస్​ సమావేశం అనంతరం అధ్యక్షుడు​ ట్రంప్ మాట్లాడుతూ…​ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నేను వ్యతిరేకిస్తున్నా. అయినప్పటికీ అధికార బదిలీ ప్రక్రియ సజావుగా సాగడానికి కృషిచేస్తాను. దీంతో అధ్యక్ష చరిత్రలోనే ఓ గొప్ప పదవీకాలం ముగియనుంది. అమెరికాను తిరిగి గొప్ప స్థాయికి చేర్చేందుకు సాగే మా పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు