ఇరవై ఏళ్లుగా పాకిస్తాన్ జైలులోనే.. ఎట్టకేలకు భారత్‌కు.. సొంత భాషను కూడా మర్చిపోయాడు

  • Published By: vamsi ,Published On : November 14, 2020 / 09:36 AM IST
ఇరవై ఏళ్లుగా పాకిస్తాన్ జైలులోనే.. ఎట్టకేలకు భారత్‌కు.. సొంత భాషను కూడా మర్చిపోయాడు

రారానుకున్నారు.. ఇక ఆశలు వదులుకున్నారు.. ఏమైపోయాడో కూడా తెలియదు.. ఎక్కడున్నాడో జాడ లేడు.. చివరకు సొంత వాళ్లను చూసుకునే అదృష్టం ఉందేమో 20ఏళ్ల తర్వాత సొంతూరికి, సొంతవాళ్ల చెంతకు చేరుకున్నాడు. తెలియక చేసిన నేరానికి దాయాది దేశం ఆగ్రహానికి గురై అక్కడి జైలులో 20ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత బిర్జు కుల్లు(Birju Kullu) అనే వ్యక్తి తన సొంత గ్రామానికి చేరుకున్నాడు.



వివరాల్లోకి వెళ్తే.. ఒరిస్సాలోని సుందర్‌ఘర్‌ జిల్లాకు చెందిన బ్రిజు కుల్లు.. 1995 సంవత్సరంలో జార్ఖాండ్‌లో ఓ హోటల్‌లో పనిచెయ్యడానికి వెళ్లాడు కుల్లు. అయితే అక్కడి నుంచి నేరం అని తెలియక పాకిస్తాన్‌ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాడు. దీంతో అతన్ని భారత గూఢాచారిగా భావించిన పాకిస్తాన్‌ సైనికులు అరెస్ట్‌ చేసి జైలులో వేశారు. అప్పటి నుంచి కుల్లు జైలులోనే జీవిస్తున్నాడు.



అయితే ఎట్టకేలకు 20ఏళ్ల తర్వాత జైలులో నుంచి బయటకు వచ్చాడు కుల్లు. కొద్దిరోజుల క్రితం అతన్ని విడుదల చేయగా.. భారత్‌ చేరుకున్న అతడు 14రోజుల పాటు అమృత్‌సర్‌లో క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత సొంతూరికి చేరుకున్నాడు. అతడికి ఘన స్వాగతం పలికారు ప్రజలు. పాటలతో, ఆటలతో సాంప్రదాయ గిరిజన నృత్యం, డ్రమ్స్ మధ్య పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కుల్లుకు స్వాగతం పలికారు. కుల్లు వస్తున్న సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రహదారికి ఇరువైపులా నిలబడి కనిపించారు.



అయితే కుల్లు తల్లిదండ్రులు ఇప్పుడు సజీవంగా లేరు, కానీ ఆమె మేనమామలు – అత్తమామలు, సోదరీమణులు మరియు ఇతర కుటుంబ సభ్యులు అతన్ని విడుదల చేసినట్లు సమాచారం వచ్చినప్పటి నుంచి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సంధ్భంగా కుల్లు మాట్లాడుతూ, ‘నేను నా గ్రామానికి తిరిగి వచ్చానని చాలా సంతోషంగా ఉన్నాను మరియు జీవితాంతం నేను ఇక్కడే ఉంటాను. నా స్నేహితులు మరియు ఇతర బంధువులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను’అన్నారు. అయితే ఇరవై ఏళ్లు కుల్లు పాకిస్తాన్ జైలులో ఉండడంతో తన సొంత భాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాడు. మర్చిపోయి సరిగ్గా మాట్లాడలేకపోయాడు.



ఈ సంధర్భంగా అతని సోదరి టెడ్రెస్ కులు మాట్లాడుతూ.. ‘మా తల్లిదండ్రులు వారి జీవితమంతా కుల్లు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ రోజు అతను తిరిగి రావడంతో సంతోషంగా ఉన్నాను. నేను ఇక అతనిని ఎక్కడికీ వెళ్ళనివ్వను’ అని అన్నారు