Home » Big Story-1 » మంచు యుగంలో మహా ప్రళయమే అంగారకుడిని ఇలా మార్చేసిందా?
Updated On - 7:07 pm, Thu, 26 November 20
By
sreehariAncient megafloods shaped Mars’s landscape : ప్రాచీన మంచు యుగం.. బిలియన్ ఏళ్ల క్రితం అంగారకుడిపై మహాప్రళయం బీభత్సం సృష్టించింది. జల ప్రళయానికి అంగారకుడి ఉపరితలం భారీకోతకు గురైంది. దాంతో అంగారకుడి రూపమే మారిపోయింది. ప్రాచీన మంచుయుగంలో రెడ్ ప్లానెట్ నీళ్లతో కళకళలాడుతూ ఉండేది.
అంగారకుడిపై వాతావరణం కూడా ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉండేదట.. అంతేకాదు.. అంగారక గ్రహం సముద్రాలు, నదులకు పుట్టినిల్లు కూడా. అలాంటి అంగారకుడిపై మహా ప్రళయం బీభత్సానికి గ్రహం ఉపరితలమంతా ఇలా మారిపోయి ఉండొచ్చునని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది.
మంచు యుగంలో నాలుగు బిలియన్ల ఏళ్ల క్రితం ఒక ఆస్టరాయిడ్ (ఉల్క) అంగారకుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది.
ఉల్క వేడి ధాటికి మంచుతో నిండిన అంగారక గ్రహంపై ఒక్కసారిగా ఉప్పెన పుట్టుకొచ్చింది. మహా ప్రళయం సంభవించి రెడ్ ప్లానెట్ ఉపరితలం ఆకృతిని మార్చేసింది. కానీ, ఇప్పుడు అప్పటిలా అంగారకుడిపై సముద్రాలు, నదులు లేవు.
ఉల్క ధాటికి నీళ్లు లేక సముద్రాలు, నదులు ఎండిపోయాయి. అంతా ఎడారిలా కనిపిస్తోంది. కానీ, ఒకప్పటి నీటి జాడల ఆనవాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. వరద తాకిడికి గురైనట్టుగా చారికలు కనిపిస్తున్నాయి.
రోవర్ క్యూరోసిటీ అందించిన sedimentological డేటా ఆధారంగా మార్స్‌పై మహా ప్రళయం సంభవించి ఉంటుందని మొదటిసారి గుర్తించినట్టు కార్నెల్ యూనివర్శిటీలోని అస్ట్రో బయాలిజిస్ట్ సహా పరిశోధకులు అల్బర్ట్ జి. ఫెయిరెన్ తెలిపారు.
గతంలో ఆర్బిటర్ డేటాలో మాత్రం అంగారకుడిపై మహా ప్రళయానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు గుర్తించలేదు. భూగ్రహం మాదిరిగానే ప్రస్తుతం అంగారకుడిపై జియోలాజికల్‌గా వరద ప్రవాహానికి సంబంధించి మార్క్స్ కనిపించాయని ఫెయిరెన్ పేర్కొన్నారు.
సెడిమెంటరీ లేయర్లో వరద ప్రవాహ ఆకృతి ఉన్నట్టుగా గుర్తించారు. ఇది దాదాపు 9 మీటర్లు (30 అడుగులు) వరకు వ్యాపించి ఉంది.
అలాగే ఎత్తు 135 మీటర్లు (145 అడుగులు) వరకు ఉందని పరిశోధకులు గుర్తించారు. నీటి తరంగాల గుర్తుల ఆధారంగా రెండు మిలియన్ ఏళ్ల క్రితం మంచు కరగడంతో మహా ప్రళయం సంభవించి ఉంటుందని పరిశోధకులు అంచనాకు వచ్చారు.
నాలుగు బిలియన్ల ఏళ్ల క్రితం ఉల్క ప్రభావంతో పెద్ద మొత్తంలో కార్బన్ డైయాక్సైడ్, మిథేన్ వాయువులు ఏర్పడినట్టు గుర్తించారు.
ఈ రెండు శక్తివంతమైన గ్రీన్హౌస్ గ్యాసులు కావడంతో అంగారకుడిపై వాతావరణం వేడిక్కిందని.. దాంతో మార్స్ పై మంచుతా కరిగిపోయి భారీ వరదలు సంభవించి ఉండొచ్చునని అంటున్నారు.
డైనోసర్ల వినాశనానికి ఆస్ట్రారాయిడ్ కాదంట.. తోకచుక్క కారణమంట!
క్రిస్మస్ రోజున భూమిపైకి వేగంగా దూసుకొస్తున్న అతిపెద్ద గ్రహశకలం
ఆరేళ్ల పాటు మిలియన్ల దూరం ప్రయాణించి భూమికి చేరిన ఆస్టరాయిడ్ శాంపుల్
గ్రహశకలానికి సీన్ కానరీ పేరు
నాసా ప్రయోగం: ఆస్టరాయిడ్‌పైకి సేఫ్ ల్యాండ్ అయిన స్పేస్‌క్రాఫ్ట్
యుఎస్ ఎన్నికలకు ముందు రోజు.. ఈ గ్రహశకలం భూమివైపుకు దూసుకొస్తుంది. మరి ఢీకొడుతుందా?