శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై మరో కమిటీ…15 రోజుల్లోగా నివేదిక

  • Published By: bheemraj ,Published On : August 23, 2020 / 10:42 PM IST
శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై మరో కమిటీ…15 రోజుల్లోగా నివేదిక

శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం మరో కమిటీ వేసింది. టీఎస్ ఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కమిటీలో సభ్యులు జెఎండీ శ్రీనివాస్ రావు, ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి, టీఎస్ జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానందం, కన్వీనర్ రత్నాకర్ ఉన్నారు. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీలను ఆదేశించింది.



ప్రమాద ఘటనపై ట్రాన్స్ కో, జన్కో సీఎండీ ప్రభాకర్ రావు కమిటీ వేశారు. ప్రమాదంలో ఎంత నష్టం జరిగింది? 9 మంది ప్రాణాలు కోల్పోయినా.. ప్రాజక్టుకు నష్టం జరుగకుండా కాపాడే ప్రయత్నం చేశారు. ఒక యూనిట్ లో మాత్రమే భారీగా నష్టం జరిగింది. మిగతా యూనిట్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అన్న అంశాలను కమిటీ అధ్యయనం చేయనుంది.

ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఐడీ నివేదిక ఇచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మొదటి యూనిట్ లో ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఇంటర్నల్ కమిటీ ద్వారా ప్రాజెక్టులో ఎంత నష్టం జరిగింది? మిగిలిన యూనిట్ లో ఎంతమేరకు పనికొచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం యూనిట్ లో జరిగిన ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ట్రాన్స్ కో వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.



నలుగురు సభ్యులు పూర్తిస్థాయిలో ప్రమాదానికి సంబంధించిన నివేదిక ఇవ్వనున్నారు. రేపు ప్రమాదం జరిగిన శ్రీశైలం ఎడమ కాలువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రాంతంలో వివరాలను సేకరిస్తారు. దీనికి సంబంధించి నష్టాన్ని అంచనా వేస్తారు. ప్యానెల్ లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా తెలుస్తోంది. మిగిలిన యూనిట్లకు సంబంధించి టర్బైన్స్ ఎలా ఉన్నాయి.

మిగతా పరికరాలు ఏ విధంగా ఉన్నాయి. అవి ఉపయోగకరంగా ఉన్నాయా? భవిష్యత్ లో పనికొస్తాయా..అన్న అంశంపై కమిటీ అధ్యయనం చేయనున్నారు. 15 రోజుల్లో సీఎండీ ప్రభాకర్ రావు నివేదిక ఇవ్వనున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా పూర్తిస్తాయిలో ఎడమ కాలువ పవర్ హౌజ్ కు సంబంధించిన పూర్వాపరాలను ప్రభుత్వానికి ఇవ్వనుంది.