వామ్మో.. బీహార్ ఓటర్ల లిస్టులో వింతలు విచిత్రాలు : ఎక్కడా జరిగుండవేమో..!!

  • Published By: nagamani ,Published On : November 4, 2020 / 04:50 PM IST
వామ్మో.. బీహార్ ఓటర్ల లిస్టులో వింతలు విచిత్రాలు : ఎక్కడా జరిగుండవేమో..!!

Bihar Election 2020 big mistakes : ఎలక్షన్ల సమయంలో ఎన్నికల సంఘం రిలీజ్ చేసే ఓటర్ల లిస్టులో చిత్ర విచిత్రాలు సర్వసాధారణం. కొత్త ఓటర్లను చేర్చటం..పాత ఓట్లరల్లో మార్పులు..అంటే గత ఎన్నికల తరువాత మరణించినవారి ఓట్ల తొలగింపు ప్రక్రియల్లో భాగంగా పలు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈక్రమంలో దొర్లే తప్పులు నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ ప్రభావం ఓట్లు వేసే ఓటర్లపై పడుతుంది. ఈ తప్పుల్లో భాగంగా చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. అటువంటి పొరపాట్లు బీహార్ ఎన్నికల్లో చిత్ర విచిత్రంగా మారాయి. ఇప్పటికి నవంబర్ 3న రెండో దశలో 94 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మూడో విడత నవంబర్ 7న జరగనుంది.



బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో చిత్ర చిత్రాలు చోటు చేసుకున్నాయి. అయితే, చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన వారికి అక్కడున్న ఓటర్ల లిస్టులో తమ పేర్లు కనిపించలేదు. చివరకు చనిపోయిన వారి జాబితాలో బతికున్న వారి పేర్లు ఉన్నాయి. దీంతో సదరు ఓటర్లు ఆశ్చర్యపోయారు. మేం బతికే ఉన్నా మా ఓటు వేసే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.



పురుషుల పేర్ల పక్కన లింగం సూచించే క్రమంలో స్త్రీ అని..అలాగే స్త్రీ ఓటరు పేరు పక్కన పురుషుడు అని ఉండటంతో వాళ్లు ఓటు హక్కును కోల్పోయారు. కొందరికైతే ఏకంగా బంధాలు మార్చేశారు. తండ్రి పేరు స్థానంలో భర్త పేరు, భర్త పేరు స్థానంలో తండ్రి పేర్లు ఉన్నాయి. మరికొందరిది ఇంకో సమస్య. వారి పేరు, లింగం, తండ్రి లేదా భర్త పేరు కరెక్టుగా ఉన్న ప్లేస్ లో ఏకంగా ఫొటోలు మారిపోయాయి.



తన తల్లి పేరు చనిపోయిన ఓటర్ల లిస్టులో ఉందని శంభునాథ్ ఝా అనే ఓటరు ఆవేదన వ్యక్తంచేశాడు. ‘మా అమ్మ బతికే ఉంది. చాలా ఆరోగ్యం కూడా ఉంది. కానీ బతికున్న మా అమ్మను చనిపోయినట్లుగా మృతుల ఓట్లర్లలో కలిపేశారని ఆవేదన వ్యక్తంచేశాడు.మా అమ్మకు ఓటింగ్ స్లిప్ రాకపోతే వివరం కనుక్కోగా తన పేరు చనిపోయిన వారి లిస్టులో ఉందని తెలిపాడు. అంతేకాదు శంభూనాథ్ మాట్లాడుతూ..తన ఇంటిపక్క వ్యక్తి కొన్ని సంవత్సరాలక్రితం చనిపోయాడు. కానీ అతని పేరు మాత్రం బతికున్నవారి ఓటర్ల లిస్టులో ఉందని ఇలాగైతే ఎలాగంటూ ప్రశ్నించాడు.



కిరణ్ దేవి అనే మహిళది మరో సమస్య..20 ఏళ్ల నుంచి నేను ఒకే నియోజవర్గం పరిధిలోనే నివసిస్తున్నా..నేను తొలిసారి ఓటు వేద్దామని చాలా ఆశపడ్డాను.కానీ నాకు ఓటర్ స్లిప్ రాలేదని వాపోయింది. అలాగే కుమ్హరార్ ప్రాంతంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఓటరు స్లిప్పులో పేరు, వయసు అన్నీ కరెక్టుగానే ఉన్నాయి..కానీ తన ఫొటోకు బదులు ఎవరో మహిళ ఫొటో ఉంది. దీంతో నేను ఓటు వేయలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశాడు.



ఓటర్ల లిస్టులో ఉన్న ఈ పొరపాట్లపై బూత్ లెవల్ ఆఫీసర్ రితురాజ్ కుమార్ మాట్లాడుతూ..ఇప్పుడున్న పరిస్థితులో తాము ఏమీ చేయలేమని..దీనిపై తాము ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి సమాచారం మాత్రమే ఇవ్వగలమన్నాని చెప్పారు. ఓటర్లకు తాము పూర్తిగా సహకారం అందించి, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నామని ఇంతకు మించి మేం చేయగలిగింది ఏమీ లేదని తెలిపారు.