బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న టీఆర్ఎస్ : బండి సంజయ్

  • Published By: bheemraj ,Published On : November 20, 2020 / 01:34 PM IST
బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న టీఆర్ఎస్ : బండి సంజయ్

Bandi Sanjay fire over CM KCR : బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్..బీజేపీపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సవాల్ మేరకు భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నానని తెలిపారు. తనతో చర్చించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారా లేదా అని ప్రశ్నించారు.



ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే అన్న మాట ప్రకారం ఆలయానికి వచ్చానని తెలిపారు. మీరొస్తే మీ మందు ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. దుబ్బాకలో సవాల్ చేసినా సీఎం కేసీఆర్ రాలేదన్నారు. లేఖపై భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాల్ చేసినా సీఎం స్పందించలేదని చెప్పారు.



వరద సాయం ఆపాలని తాను ఈసీకి లేఖ రాసినట్లు ఆరోపించారని పేర్కొన్నారు. తన లేఖ వల్లే వరద సాయం ఆపినట్లు తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అసత్య ఆరోపణలు చేయడం బాధనిపించిందన్నారు. ఈసీకి రాసిన లేఖలో ఉన్న సంతకం తనది కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి ఘనత మీద ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంతో కుమ్మక్కై బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు.



https://10tv.in/we-welcome-supreme-courts-ruling-cbi-has-become-like-a-pan-shop-under-bjp-govt-maharashtra-minister/
ప్రజలు లక్షల్లో నష్టపోతే కేవలం రూ.10 వేలు పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. నాలాలు, చెరువుల అక్రమణలతో భాగ్యనగరం కుంచించుకుపోయిందన్నారు. ఓట్ల కోసం అడ్డదారులు తొక్కితే టీఆర్ఎస్ భాగ్యనగర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భాగ్యనగరాన్ని పాతబస్తీగా మారుస్తారా..లేక పాతబస్తీనే భాగ్యనగరంగా మారుస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.



మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే రూ.25 వేలు వరద సాయం అందిస్తామని చెప్పారు. వరద బాధితులకు పూర్తిస్థాయి సాయం అందించాలన్నది బీజేపీ లక్ష్యమన్నారు. భాగ్యనగరం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందని, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు తీసుకొస్తామన్నారు.