Delhi పోలీస్ చరిత్రలో తొలిసారి: 76 మంది మిస్సింగ్ చిన్నారులను కనిపెట్టిన మహిళా పోలీస్..అరుదైన గుర్తింపునిచ్చిన అధికారులు

  • Published By: nagamani ,Published On : November 19, 2020 / 12:48 PM IST
Delhi పోలీస్ చరిత్రలో తొలిసారి: 76 మంది మిస్సింగ్  చిన్నారులను కనిపెట్టిన మహిళా పోలీస్..అరుదైన గుర్తింపునిచ్చిన అధికారులు

Delhi Women conistable Seema Dhaka trace 76 missing children : ఢిల్లీ పోలీసు చరిత్రలో చాలా అరుదైనా..అద్భుతమైన ఘనతను దక్కించుకున్నారు ఓ మహిళా పోలీసు అధికారి. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే ఓ మహిళా పోలీసు అధికారిణి తన ప్రతిభతో కనిపించకుండా పోయిన 76 మంది ఆచూకీని కనిపెట్టారు. ఆ డేరింగ్ పోలీసమ్మ పేరు సీమా ఢాకా. ఆమె సాధించిన ఓ గొప్ప ఘనతకు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉండే నిబంధనలను కూడా పక్కన బెట్టి, ప్రమోషన్ ఇచ్చి సత్కరించారు.



కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సీమా ఢాకాను హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ప్రమోషన్ ఇచ్చి సీమా ఢాకాను ఢిల్లీలోని సమయ్ పూర్ బాడ్లీ పోలీసు స్టేషన్ లో ఆమెను నియమించామని..ఓటీపీ (అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్) ఓ మహిళకు దక్కడం ఇదే తొలిసారని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.




https://10tv.in/america-atlanta-yong-woman-beaten-by-the-man-who-met-through-dating-app/
వివరాల్లోకి వెళితే..ఎవరైనా పిల్లలు కనిపించకుండాపోయారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలా సీమా వెంటనే కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిపోతారు. వారిని కనిపెట్టి వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకూ నిద్రపోరు. సాటి మహిళగా..ఓపోలీసుగా సీమా తన కర్తవ్యాన్ని నూటికి నూరు శాతం అంకిత భావంతో చేసి తీరతారు. బిడ్డలు కనిపించకుండాపోతే ఆ తల్లి మనస్సు ఎంతగా తల్లడిల్లిపోతుందో..అదే ఓ పోలీసుగా ఉన్న ఆమెకు బాగా తెలుసు.


దీంతో వెంటనే రంగంలోకి దిగి ఆ పిల్లల్ని కనిపెట్టి వారికి అప్పగిస్తారామె.అలా సీమా ఢాకా ఇప్పటివరకూ 76 మంది ఆచూకీ కనిపెట్టడంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మిస్సింగ్ అయిన పిల్లల్లో 56 మంది 14 ఏళ్ల లోపువారే కావడం గమనించాల్సిన విషయం.సీమా సేవలు కేవలం ఢిల్లీ నగరానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రాంతాలతో సంబంధం లేకుండా పిల్లలు కనిపించలేదు అంటే చాలు వర్క్ లో దిగిపోతారామె.వారిని కనిపెట్టేదాకా వదలరు.


అలా ఒక్క ఢిల్లీలోనే కాకుండా పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం ఆమెను ప్రత్యేకంగా పిలిపించి, మిస్సింగ్ కేసులను అప్పగించాయి. వాటిని నూరుశాతం పరిష్కరించిచూపారు సీమా. ఆమె సేవలను గుర్తించిన ఢిల్లీ పోలీసు కమిషనర్ S.N. Shrivastava “సీమా ఢాకా సేవల్ని ఎంత అభినందించినా తక్కువే. ప్రత్యేక ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఆమెకు ప్రమోషన్ ఇచ్చామని తెలిపారు. ఆమె ధైర్య సాహసాలకు..చేసిన సేవలకు ఈ గుర్తింపు చాలా తక్కువేనన్నారు. మిస్ అయిన పిల్లల్ని కనిపెట్టి సీమా ఎంతో మంది కుటుంబాల్లో ఆమె సంతోషాన్ని నింపారని ప్రశంసించారు.


అమ్మలకు వారి బిడ్డల్ని తిరిగి అందించిన సీమా ఢాకాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ కానిస్టేబుల్ గా ఆమె చేసిన సేవలు ప్రతీ పోలీసుకు స్ఫూర్తినిస్తాయని అభినందనలు కురుస్తాన్నారు.ఢిల్లీ పోలీసు విభాగానికి సీమా అందించిన సేవలు ఎంతో అద్భుతనమైనవి..విలువైనవని..ఎన్నో ఏళ్ల క్రితం తప్పిపోయిన పిల్లలను కూడా సీమా కనిపెట్టారని వారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన సీమా గొప్పతనానికి నిదర్శనమని ప్రశంసిస్తున్నారు పలువురు. ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కాశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పొగిడారు.