విదేశీ యువకుడిని ప్రేమించిందని కూతురికి గుండుగీయించిన తల్లిదండ్రులు..కుటుంబాన్ని బహిష్కరించిన దేశం

  • Published By: nagamani ,Published On : October 26, 2020 / 11:17 AM IST
విదేశీ యువకుడిని ప్రేమించిందని కూతురికి గుండుగీయించిన తల్లిదండ్రులు..కుటుంబాన్ని బహిష్కరించిన దేశం

France : కులాంత వివాహం చేసుకున్న జంటల్ని దారుణంగా ‘‘పరువు హత్యల’’పేరుతో హతమార్చే ఘటనలో భారత్ లోని పలు రాష్ట్రాల్లో చూస్తున్నాం. తమ కూతుర్ని పెళ్లిచేసుకున్న జంట్లో యువకుల్ని దారుణంగా చంపేసిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ‘‘అమృత భర్త ప్రణయ్.. అవంతి భర్త్ హేమంత్ లను ఎంత దారుణంగా హత్య చేశారో తెలిసిందే. ఈ ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచనలనం కలిగించాయి.


కానీ వేరే దేశస్థుడిని ప్రేమించిందని కూతురికి (మైనర్) ఆమె తల్లిదండ్రులకే గుండు గీయించిన ఘటన ఫ్రాన్స్‌లో దేశంలో చోటు చేసుకుంది. కన్నకూతురికి శిరోమండనం చేశారు. దీనిపై ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాలిక పట్ల వారి కుటుంబ సభ్యులు చేసింది దారుణమై నేరమని ఆగ్రహం వ్యక్తంచేసింది ప్రభుత్వం. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు కుటుంబంలోని మొత్తం ఐదుగురిని దేశ బహిష్కరణ చేసింది.


బోస్నియాకు చెందిన ఓ కుటుంబం ఫ్రాన్స్‌లోని బెసాన్‌కాన్‌ నగరంలో గత రెండు సంవత్సరాల నివసిస్తున్నారు. వారి 17ఏళ్ల కూతురు అదే బిల్డింగ్ లో నివసిస్తున్న సెర్బియా దేశానికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమించుకుంటున్నారు. వారిద్దరికి దేశాలే కాదు మతాలు కూడా వేరు. వారి వారి సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ వేరే. కానీ ప్రేమకు దేశం..ప్రాంతం..సంస్కృతీ సంప్రదాయాలు అడ్డురావని నమ్మిన వారిద్దరూ వారి కుటుంబాలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


ఇంతలో ఈ విషయం కాస్తా బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. అంతే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డారు. మనకు వారికి సరిపడదు ఆ అబ్బాయిని మర్చిపోమ్మని చెప్పారు. కానీ ఆమె వినలేదు. ప్రేమించుకున్నాం పెళ్లిచేయండి లేదా మేమే చేసుకుంటామని మొండిగా చెప్పింది.


దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఇంటిలోంచి కదలకుండా ఓ రూమ్ లో బంధించారు. అతడ్ని పెళ్లిచేసుకోనని చెప్పు లేకపోతే నీ అంతు చూస్తాం అంటూ తిట్టేవారు..కొట్టేవారు.. శారీరకంగా ఎన్నో రకాలుగా హింసించారు. అయినా సరే ప్రేమించినవాణ్ణే పెళ్లిచేసుకుంటానని..మీరు నన్ను ఎన్నిరకాలుగా హింసించినా నా నిర్ణయం మారదనీ తెగేసి చెప్పింది. దీంతో నీ సంగతి ఇలాకాదు అంటూ తల్లిదండ్రులిద్దరు ఆమెకు గుండు గీసారు.


ఈ క్రమంలో కన్నవారు పెట్టే హింసలకు..ఆ బాలిక అనారోగ్యానికి గురైంది. తిండిపెట్టకుండా..నీళ్లు కూడా ఇవ్వకుండా వేధించటంతో నీరసించిపోయింది. తీవ్ర అనారోగ్యానికి గురి కావటంతో బాలిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం ఫ్రెంచ్ మీడియాకు తెలియటంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. దీంట్లో భాగంగా బాలిక తల్లిదండ్రులతో పాటు మరో ముగ్గురు బంధువులు కూడా బాలికను వేధించారని తేలింది.


మైనర్ పట్ల అంత్యంత అనాగరికంగా ప్రవర్తించిన బాలిక తల్లిదండ్రులతో పాటు మొత్తం కుటుంబాన్ని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం వీరి కుటుంబం ఫ్రాన్స్ దేశంలో జీవించటానికి వీల్లేదంటూ అక్టోబర్ 24,2020న బెసాన్‌కాన్‌ నగరం నుంచి బోస్నియా రాజధాని సరజెవోకు తరలించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాలశాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.


ప్రస్తుతం ఈ మైనర్‌ బాలిక బాధ్యతలను స్థానిక సామాజిక సేవా సంస్థ చూసుకుంటోంది. బాలిక మేజర్‌ అయిన తర్వాత ఫ్రాన్స్‌లోనే నివసించే హక్కు ఆ అమ్మాయికి వస్తుందని అప్పటి వరకూ సేవా సంస్థే ఆ బాధ్యత తీసుకోవాలని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కాగా..బోస్నియా, సెర్బియా దేశాల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. 1990 సంవత్సరంలో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధంలో వేలాది మంది పౌరులు మృతిచెందారు.


దీనిపై బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..బోస్నియాకు చెందిన ముస్లిం కుటుంబం..మా అమ్మాయి ప్రేమించిన అబ్బాయి సెర్బియాకు చెందిన క్రిష్టియన్ కుటుంబం..మావి దేశాలేకాదు కులాలు కూడా వేరు..వారివి మావి కులాలే కాదు సంస్కృతి సంప్రదాయాలు దేశాలు కూడా వేరు మరి అటువంటి కుటుంబంలోని అబ్బాయిని మా అమ్మాయి పెళ్లిచేసుకోవటానికి మేమెలా ఒప్పుకుంటాం అందుకే వద్దని చెప్పినా మా అమ్మాయి వినలేదు..మా దేశ కుల సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉంది అందుకే ఇలా చేశాం అని చెప్పారు.