మెడలో మంగళసూత్రం ధరించిన మహిళలు గొలుసులతో కట్టేసిన కుక్కలతో సమానం : ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: nagamani ,Published On : November 11, 2020 / 11:19 AM IST
మెడలో మంగళసూత్రం ధరించిన మహిళలు గొలుసులతో కట్టేసిన కుక్కలతో సమానం : ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

Goa women professor mangalsutra with ‘chained dog’ : మెడలో మంగళసూత్రం ధరించే మహిళలు కుక్కలతో సమానం అనీ..వారి మెడలో ఉన్నది తాళి కాదని అది కుక్క మెడలోకట్టే గొలుసులాంటిందని ఓ మహిళా ప్రొఫెసర్  తీవ్ర వ్యాఖ్యలుచేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ సంప్రదాయాలను ఆమె అవమానించారనీ..తోటి మహిళలను కుక్కలతో పోల్చారనీ అదేనా ఆమె  చదువు ఆమెకు నేర్పిన సంస్కారం అంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.



ఈక్రమంలో ఆమె చేసిన పరుష వ్యాఖ్యలతో పోలీసు కేసు నమోదు కావటం..ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్స్ వెల్లువెత్తున్నాయి. ఇటువంటి వారు బోధనా రంగంలో ఉంటే విద్యార్ధులకు అవే నేర్పిస్తారనీ..హిందూ సంప్రదాయాలను దెబ్బతీస్తున్న ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్స్ వస్తున్నాయి.



వివరాల్లోకి వెళితే..గోవా రాజధాని పనాజీలోని వీఎం సాల్గావ్ కర్ లా కాలేజ్ లో శిల్పా సింగ్ అనే మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె తన ఫేస్ బుక్ పేజీలో వివాహిత మహిళలను ఉద్ధేశించి ‘‘మెడలో మంగళసూత్రం ధరించే మహిళలు గొలుసులతో కట్టేసిన కుక్కలతో సమానం అని వ్యాఖ్యానించారు.
https://10tv.in/mumbai-pet-dog-saves-woman-after-shirtless-stalker-enters-house-to-sexually-assault-her/



తాళి వేసుకునే మహిళలు ‘‘చైన్డ్ డాగ్స్’’తో పోల్చారు. శిల్పాసింగ్ పోస్ట్ పై రాష్ట్రీయ హిందు యువ వాహిని గోవా విభాగానికి చెందిన రాజీవ్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపోస్టు తో విమర్శలు ఎదుర్కోవటంతో పాటు పలువురు ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.



మతపరమైన భావాలను ప్రొఫెసర్ శిల్పా సింగ్ కావాలనే అవమానించారని ఆరోపించారు. ఆమెపై పనాజీ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సెక్షన్ 295 (ఏ) కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ఆమెను సస్పెండ్ చేయాలని కాలేజీ యాజమాన్యాన్ని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.


కాగా..శిల్పా సింగ్ పై కేసు నమోదు చేయటానికి ముందే ఆమె క్షమాపణలు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. నా వ్యాఖ్యాల (పోస్ట్) ద్వారా నా తోటి మహిళలను బాధపెట్టినట్లైతే క్షమించమని కోరుకుంటున్నాననీ..విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.



మహిళలను అవమానించాలనే ఉద్ధేశ్యంతో తాను ఇలా అనలేదనీ..మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలిగానీ..ప్రత్యేకంగా ఇటువంటి చిహ్నాల ద్వారా గుర్తింపు ఎందుకు? మాకు వివాహం అయ్యిందని తెలిసేలా ఇటువంటి చిహ్నాలు ఎందుకు అనే ఉద్ధేశ్యంతోనేఅన్నానని వివరణకూడా ఇచ్చారు.